ఉదయం శృంగారం చేస్తే ఎన్ని లాభాలో తెలుసా?

Purushottham Vinay
శృంగారం అనేది మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఇంకా అలాగే ఎంతో ఆనందంగా ఉండేలా చేస్తుంది. ఇది మన మధ్య బంధాన్ని కూడా దగ్గర చేస్తుంది. సెక్స్ చేయడానికి సరైన సమయం ఏంటంటే అది ఉదయమే అని చెప్పవచ్చు. పొద్దున పూట చేసే సెక్స్ ఎంతో అద్భుతంగా ఉంటుందట.పొద్దున్నే మనం మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి పక్కన నిద్ర లేవడం అలాగే రాత్రంతా కూడా ప్రేమతో కౌగిలించుకొని ఉన్న ఆ వ్యక్తితో ఆనందంగా సెక్స్‌ చెయ్యడం వల్ల.. ఆ రోజంతా కూడా ఎంతో ఆనందంగా అలాగే ఉల్లాసంగా ఉంటుందట. అలాగే మనం ప్రతి ఛాలెంజ్‌కి కూడా సిద్ధం అయ్యేలా కూడా సెక్స్ చేస్తుందట. ఇక ఇవే కాదు..పొద్దున్నే సెక్స్‌ చేసుకోవడం వల్ల ఇంకా మరెన్నో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి.పొద్దున్నే సెక్స్ చేస్తూ రోజును ప్రారంభించడం వల్ల.. ఆ తర్వాత రోజంతా కూడా మీరు బాగా నవ్వుతూ ఉండిపోతారు. అలాగే పొద్దున్నే జరిగిన సెక్స్ గురించి ఆలోచిస్తూ బాగా ఆనందపడతారు. ఉదయాన్నే అద్భుతమైన సెక్స్ సెషన్‌తో ఆ రోజును ప్రారంభిస్తే చాలు ఇక మీకు ఆ రోజు కూడా అంతే అద్భుతంగా గడుస్తుందట.
రోజు సెక్స్‌ చేసుకోవడం వల్ల మన బాడీలో ఆక్సిటోసిన్ ఇంకా డోపమైన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. అందుకే ఉదయాన్నే సెక్స్‌ చేసుకోవడం వల్ల.. ఈ ఫీల్ గుడ్ హార్మోన్లు మరిన్ని విడుదలై మీరు రోజంతా చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉండేలా చేస్తాయి.అలాగే చాలామందికి పొద్దున్నే జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయడం చాలా అలవాటు. ఇంకొందరు అయితే జాగింగ్‌కి వెళ్తుంటారు. కానీ వాటన్నిటి కంటే కూడా ముందే మీ వర్కవుట్ ని మీరు చాలా ఈజీగా పూర్తి చేయవచ్చు. అదీ కూడా మీ బెడ్ రూంలోనే చెయ్యొచ్చు.అవును.. సెక్స్ చెయ్యడం వల్ల కండలు బాగా పెరుగుతాయి. అలాగే క్యాలరీలు కూడా కరుగుతాయి.పొద్దున్నే లేవగానే మగాళ్ల శరీరంలో.. టెస్టోస్టిరాన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఇక ఆడవారికి మూడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇద్దరూ సెక్స్‌ బాగా చేసుకొని  అత్యంత ఆనందాన్ని పొందే అవకాశం వుంటుందట.అలాగే సెక్స్ కూడా చాలా ఎక్కువ సేపు చేసుకోవచ్చునట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: