కరోనా టైంలో హోటల్ భోజనమా..ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే ?
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో... భౌతిక దూరం కచ్చితంగా పాటించాల్సిందే. ఈ మహమ్మారి వైరస్ గాలి ద్వారా సోకుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కనీసం ఆరడుగుల దూరాన్ని పాటించడం చాలా మంచిది. హోటల్స్ లో చాలామంది భోజనం చేయడానికి వస్తారు కాబట్టి... టేబుల్స్ పై వైరస్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూర్చుని టేబుల్స్ పై శానిటైజర్ చేయించుకుంటే... మనకు కరోనా సోకే అవకాశం ఉండకపోవచ్చు. అలాగే వెంటిలేషన్ బాగా ఉన్న హోటల్లో కి మాత్రమే మనం వెళ్ళాలి. ఇరుకుగా ఉన్న హోటల్లో వెళితే కరోన విజృంభించే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు హోటల్ లో పనిచేసే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఎక్కువ గా కస్టమర్లతో టచ్ లో ఉంటారు కాబట్టి వారి పట్ల భౌతిక దూరం పాటించాల్సిందే. మరీ ముఖ్యంగా మనం హోటల్ లో భోజనం చేసేటప్పుడు.... హ్యాండ్ వాష్ తప్పనిసరి.
హోటల్స్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి :
హోటల్ అనగానే గుర్తుకు వచ్చేది ఆయిల్ ఫుడ్. ఈ కరోనా సమయంలో హోటల్స్ లో ఆయిల్ ఫుడ్డు కు దూరంగా ఉండి మన ఆరోగ్యానికి మంచి చేసే ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. కరోనా నుంచి కాపాడే రోగనిరోధక శక్తి పెంచి ఆహారాన్ని తీసుకుంటే మన శరీరానికి మంచిది.
రక రకాలైన కూరగాయలు అన్ని కాలాల్లోనూ లభించే పాలు పెరుగు గింజలూ గుడ్లు పండ్లు మొదలైనవి ఆహారంలో ఉండేలా చూసుకుంటే కరోనా మహమ్మారి ని తరిమి కొట్టవచ్చును.