మోకాళ్ల నొప్పులకు చెక్.. ఆధునిక చికిత్స వచ్చేస్తుంది..?

MOHAN BABU
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి  మోకాళ్ళ నొప్పులకు  ఎలాంటి మార్పిడి అవసరం లేకుండా చాలా బలమైన ప్లేట్లెట్  రిచ్ ప్లాస్మా  వైద్యం అందుబాటులోకి వచ్చింది. వయసు పైబడిన వాళ్లలో కూడా  సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ళ నొప్పులు. ఈ యొక్క సమస్య  వారిని తీవ్రమైన నొప్పితో బాధ పెడుతుంది. ఈ నొప్పిని భరించలేక జీవితం పట్ల నిరాశా నిస్పృహతో అనేక పరిణామాలకు దారితీస్తుంది. అటువంటి తీవ్రమైన పరిస్థితుల నుంచి  మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి నూతన వైద్య విధానం ప్లేట్లెట్ రిచ్  ప్లాస్మా  ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ వారు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యొక్క చికిత్స విధానంలో పేషెంట్ యొక్క రక్తంలోని  ప్లాస్మాను  సంగ్రహించి  ఈ సమస్యతో బాధ పడుతున్నటువంటి  వారి యొక్క మోకాళ్ల దగ్గర  ప్రవేశపెట్టి చికిత్సను అందిస్తారు.

దీనిలో  వయసు తో ఏం సంబంధం లేకుండా  పీఆర్పీ చికిత్స విధానంతో ఎవరైనా లబ్ధి పొందవచ్చు. మోకాలు నొప్పులు అనేది మనం ఎదుర్కొనే  సాధారణ ఆరోగ్య సమస్య ఎక్కువగా 45 ఏళ్ల వయసు అంతకు మించి ఉన్నవారికి, ముఖ్యంగా వృద్ధులలో  అధికంగా ఉంటుంది. యువకులు అయితే  ఎక్కువగా క్రీడాకారులలో గాయాల వలన, మరియు అధిక బరువుతో ఉండేటువంటి స్థూలకాయుల్లో  ఈ యొక్క మోకాలినొప్పి సమస్య  తరచూ వస్తూ ఉంటుంది. దీనికి పీఆర్పీ చికిత్స విధానంతో లబ్ధి పొందవచ్చు. ప్లేట్ లెట్స్ శరీరంలో ఉండే చిన్న కణాలు, ఇవి ఎక్కువగా రక్తం గడ్డకట్టే ప్రక్రియలో పాల్గొంటాయి. దెబ్బతిన్న ప్రదేశంలోకి ప్లేట్లెట్స్ రీచ్ ప్లాస్మా  ఎక్కించిన తర్వాత  వృద్ధి దారాలాలు ఎక్కువైపోయి, మొత్తం కణాల సంఖ్య పెరిగే  ఉపశమనం లభిస్తుంది. ఈ యొక్క చికిత్స 30 నిమిషాల్లో పూర్తవుతుంది.

మోకాళ్ళ మార్పిడి తరహాలో  రక్తస్రావం కానీ, నొప్పిగానీ ఇందులో కనిపించవు. పిఆర్పి చికిత్స పొందిన రోగులు ఎటువంటి ఇబ్బంది లేకుండా  చికిత్స పూర్తయిన వెంటనే  ఇంటికి వెళ్ళిపోవచ్చు. చికిత్స యొక్క ప్రధాన ఉపయోగం ఏమిటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చిన్న ఇంజెక్షన్ ద్వారా ఈ యొక్క సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ చికిత్స మొదటి నుంచే నొప్పి తగ్గడం ప్రారంభమవుతుంది. మోకాలు యొక్క చికిత్స కోసం ఉన్నటువంటి ఇతర చికిత్సా పద్ధతులు  ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా విధానం కంటే  సమర్థవంతమైనదని  నిరూపించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: