వడ్ల నుంచి వచ్చే తవుడు వల్ల ఉపయోగాలు..

Divya
మనం చిన్నప్పుడు నుంచి వరి సాగు చూసే ఉంటాం అలాగే వడ్లను చూసే ఉంటాం.అంతేకాకుండా పూర్వము వడ్లను దంచి బియ్యంని బయటికి తీసే వారు.ఇక ఇప్పుడు టెక్నాలజీ మారుతున్న కొద్దీ మిషన్ తో ఆడించుకుంటున్నారు.ఈ మెషిన్ ల వల్ల మనుషులకు కూడా శ్రమ తగ్గింతోందనే చెప్పవచ్చు. అందులో వడ్ల నుంచి వచ్చేటువంటి తవుడు ను తినడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.
ప్రతి ఒక్క ధాన్యపు గింజకు పోషకాల అనేటివి ఎక్కువగా , గింజ పైన ఉన్న పొట్టు మీద ఉంటాయి. లోపలి పొరల్లో మాత్రం వట్టి పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి. గింజలపై  ఉన్న పొట్టు మీద కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేతనే తవుడు గానుగ ఆడిస్తే నూనె వస్తుంది. అంతేకాకుండా అందులోనే పీచు పదార్ధాలు ఎక్కువగానే ఉంటాయి. విటమిన్స్  మరియు బికాంప్లెక్స్ వంటి పోషకాలు కూడా ఉంటాయి.
అప్పుడే ఆడించిన బియ్యపు తవుడు ను అలాగే తినవచ్చు. వీటిని ఏదైనా మనకు నచ్చిన గింజలతో కలిపి తినవచ్చు.  గోధుమలను పాలిష్ పట్టిన తర్వాత పైన ఉన్న పొరను తినవచ్చు. కొర్రలను పాలిష్ పట్టడానికి ముందు వచ్చే  పొట్టును కూడా  తినవచ్చు. ఇలా తినడం వల్ల మనకు  శక్తి చాలా వస్తుంది.
మినపపిండి తవుడు ను వేయించి సున్నుండలు చేసే టప్పుడు, ఎండు ఖర్జూరం పొడిని, తేనెను కలపడం వల్ల చాలా టెస్ట్ గా ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా..
ఇంట్లో ఉన్న వారికి విటమిన్  - ఈ లోపం ఉన్న తవుడు ను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిసేపు ఉంచి, ఆ తర్వాత వడగట్టి, అ నీటిలోకి తేనె/నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల బీ కాంప్లెక్స్ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
ఇలాంటి పద్ధతులను ఉపయోగించడం వల్ల ఎటువంటి ఖర్చు లేకుండా ఆరోగ్యకరంగా ఉండవచ్చు. కొంతమంది ఈ తవుడిని పశువులకు దాణాగా మాత్రమే వేస్తారు. పోషకాలు కలిగిన తవుడును పశువులు తినడం వల్ల, బలిష్టంగా ,ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎక్కువ పాలు ఇవ్వడానికి కూడా దోహదపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: