నిద్రలో కలవరింతలా.. పేరెంట్స్ జాగ్రత్త?

praveen
మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం.. ఎన్నో సన్నివేశాలలో కొంతమంది నటులు ఇక నిద్రలో కలవరించడం లాంటివి చేస్తూ ఉంటారు. నిద్రలో కలవరిస్తూ ఎన్నో విషయాలను మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో కొన్ని నిజాలను కూడా బయట పెడుతూ ఉంటారు అన్నది అటు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అయితే నిజ జీవితంలో ఇలా జరుగుతుందా అంటే  అప్పుడప్పుడు కొంతమంది ఇలాగే నిద్రలో కలవరిస్తూ ఉంటారు.  ఇక రోజంతా జరిగిన విషయాల్లో తమకు బాగా గుర్తుండే విషయాన్ని ఇక నిద్రలో కలవరిస్తూ ఉండడం చేస్తూ ఉంటారు. ఇలా నిద్రలో కలవరించడం అనేది ఎక్కువగా చిన్న పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది.

 అయితే ఇలా చిన్న పిల్లలు తరచూ నిద్రలో కలవరిస్తూ ఉన్న సమయంలో తల్లిదండ్రులు ఇక ఏదో మామూలుగా పిల్లలు నిద్రలో కలవరిస్తూ ఉన్నారులే అనుకుని లైట్ తీసుకుంటూ ఉంటారు  అయితే అలా తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు  నిద్రలో కలవరించడం ఈ శాస్త్ర పరిభాషలో సోమ్నీ లిక్వి అని అంటారట.  ఇది కేవలం కొంత మందిలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. 3 నుంచి పదేళ్లలోపు వయసు ఉన్న పిల్లలు ఇలా నిద్రలో ఎక్కువగా మాట్లాడటానికి ఆస్కారం ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.  నిద్రలో చిన్న పిల్లలు మాట్లాడటం సాధారణమే అయినప్పటికీ ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించడం ఎంతో మేలు అంటూ నిపుణులు సూచిస్తున్నారు.

 అయితే పెద్దల్లో కూడా ఐదు శాతం మంది ఇలా నిద్రలో కలవరించే వారు ఉంటారు అని నిపుణులు చెబుతున్నారు. ఇలా నిద్రలో కలవరిస్తూ ఉండటానికి కారణం పీడకలలు ఎమోషనల్ ఒత్తిడి మానసిక ఆరోగ్యం పాడవడం లాంటివి అని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ఒక రోజులో ఏ పని అయితే ఎక్కువగా మెదడును ప్రభావితం చేస్తుందో ఇక దానికి సంబంధించి నిద్రలో కలవరించే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. అంతేకాకుండా రోజువారి పనులు ఆటలు సంభాషణలు కూడా అప్పుడప్పుడు కలవరిస్తూ ఉంటారట. అయితే ఇలా పిల్లలు నిద్రలో భయపడుతూ ఏదైనా కలవరిస్తూ ఉంటే వారిని వెంటనే దగ్గరికి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు  ఇలాంటి కలవరింతలు ఎక్కువ అయితే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మేలు అంటూ సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: