డెంగ్యూ సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
డెంగ్యూ జ్వరానికి ఎటువంటి వ్యాక్సిన్ లేదు కాబట్టి దోమలు కుట్టకుండా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. కాబట్టి మీ ఇంటి ఆవరణలో, మీ ఇంట్లో శుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి.ముఖ్యంగా చిన్న పిల్లలు దోమలు కుట్టకుండా చూసుకోండి. దోమలు కుట్టడం వలన డెంగ్యూ వస్తుంది అని గుర్తించి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఇక డెంగ్యూ జ్వరం ఉంటే సింపుల్ గా పారాసిటమాల్ వేసుకోవచ్చు. దీంతో జ్వరం తగ్గుతుంది. అయితే డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు aspirin, Ibuprofen, Nemuslide, pain killers వీటిని వాడటం మంచిది కాదు. ఎందుకంటే దీని కారణంగా బ్లీడింగ్ మరింత ఎక్కువ అవుతుంది.కాబట్టి జాగ్రత్తగా డాక్టర్ సూచనలు ప్రకారం మందులు తీసుకోండి.ఇక మన ఇంట్లో పాత సామాన్లు ముఖ్యంగా పాత టైర్లు, క్యాన్స్, పూల కుండీలు మొదలైన వాటిలో నీళ్లు ఎక్కువగా చేరిపోతాయి. వీలైనంతవరకు పాత సామాన్లని నీళ్ళు తగలకుండా ఉంచుకోండి లేదు అంటే అక్కడ దోమలు ఎక్కువగా చేరుతాయి. దీని వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి.మీ ఇంట్లో వాడే కూలర్‌లో నీళ్లు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి. ఇంట్లో పెంపుడు జంతువులకు ఉపయోగించే డిష్‌లో నీళ్లు ఎక్కువగా చేరుతాయి. వాటిని కూడా శుభ్రంగా పొడిగా ఉంచుకోవడం మంచిది. లేదు అంటే వీటి వల్ల కూడా దోమలు చేరి డెంగ్యూకి కారణమవుతాయి.ఇంట్లో మస్కిటో నెట్స్ వంటివి వాడండి. దీని వల్ల దోమలు కుట్టకుండా మీరు జాగ్రత్త పడొచ్చు.ఎక్కువ జనం ఉండే ప్రదేశాల లో ఉండటం మంచిది కాదు. మీకు వీలైతే వాళ్ల నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.దోమలు కుట్టకుండా ఉండడానికి క్రీమ్ రాసుకోవడం, దోమలు మీ ఇంట్లో ఉండకుండా ఉండడానికి దోమల మందు, లిక్విడ్స్ లాంటివి వాడడం చేయండి. దీని వల్ల దోమలు మీ దరిచేరకుండా ఉంటాయి.