కేంద్రానికి తలనొప్పిగా మారిన బ్లాక్ ఫంగస్.. లక్షణాలివే..

Purushottham Vinay
క‌రోనా సెకండ్ వేవ్ దేశంలో చాలా దారుణంగా విజ్రుంభిస్తుంది. ఇక ఈ వైరస్ ఇప్ప‌ట్లో ఇప్పట్లో తగ్గేలా అసలు కనిపించడం లేదు. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో రూపాన్ని మార్చుకొని మ‌రింత విరుచుకుప‌డుతోందీ కరోనా మహమ్మారి. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అయితే క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత కూడా ఈ కరోనా మహమ్మారి ప్ర‌జ‌ల‌ను వ‌దిలేలా క‌నిపించ‌ట్లేదు. తాజాగా బ్లాక్ ఫంగ‌స్‌/మ్యుక‌ర్‌మైకోసిస్ పేరుతో కొత్త వ్యాధి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది.ఇది ఇప్పుడు కేంద్రానికి పెద్ద తలనొప్పిగా మారింది.మొన్న‌టి వ‌ర‌కు ఉత్త‌ర భార‌త‌దేశానికి పరిమిత‌మైన ఈ వ్యాధి తాజాగా మన తెలుగు రాష్ట్రాలలో కూడా క‌నిపించ‌డం ఆందోళన కలిగిస్తుంది. దీంతో అంద‌రిలో క‌ల‌వ‌రం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష వ‌ర్ధ‌న్‌ ప‌లు సూచ‌న‌లు చేశారు.


మంత్రి మాట్లాడుతూ..చక్కెర స్థాయి నియంత్రణలో లేనివారు అంటే షుగర్ వ్యాధితో బాధపడేవారు, కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సల్లో భాగంగా రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు వాడిన వారిలో ఈ వ్యాధి బయటపడుతోందట.కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్న కొందరిలో దీన్ని గుర్తిస్తున్నారు.ఇతర ఆరోగ్య సమస్యలున్నవారిలో కూడా ఇది బయటపడుతుందని చెప్పారు.ఇక ఈ వ్యాధి లక్షణాలు విషయానికి వస్తే..కళ్లు, ముక్కు చుట్టూ నొప్పి, ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు, మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్థాయని వెల్లడించారు.


అయితే కరోనా రోగులందరికీ ఇది రాదని, చికిత్సలో భాగంగా స్టిరాయిడ్లు తీసుకున్న వారందరూ బ్లాక్‌ఫంగస్ బారిన పడతారనేది వాస్తవం కాదని వైద్యులు చెబుతున్నారు.ఇటీవ‌లి కాలంలో ఈ వ్యాధిని కొంత మంది కోవిడ్ రోగుల్లో గుర్తించామ‌ని చెప్పుకొచ్చారు. మొద‌ట్లోనే రోగ నిర్ధార‌ణతో ఈ వ్యాధి వ్యాప్తికి అడ్డుక‌ట్ట‌వేయ‌వ‌చ్చ‌ని హ‌ర్ష వ‌ర్ధ‌న్ సూచించారు. ఈ వ్యాధి అంత‌కు ముందు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలను ఎక్కువ‌గా ప్రభావితం చేస్తుందని చెప్పిన మంత్రి.. ఇది పర్యావరణ వ్యాధికారకాలతో పోరాడే శక్తిని తగ్గిస్తుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: