కోవాక్సిన్ వేసుకోవాలా.. ? కోవిషీల్డ్ వేసుకోవాలా.. ?

MADDIBOINA AJAY KUMAR
దేశంలో మే 01 నుంచి మూడో దశ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ప్రారంభం కానుంది. మూడోద‌శ‌లో 18 ఏళ్లు పై బ‌డినవారంద‌రికీ వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నారు. అంటువ్యాధులు వైర‌స్ ల‌ను అరిక‌ట్టడానికి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో దేశాల్లో వ్యాక్సిన్ లు ఇచ్చారు. కానీ ఇదే ప్ర‌పంచంలో అతిపెద్ద వ్యాక్సినేష‌న్ డ్రైవ్. ఇదిలా ఉండ‌గా దేశంలో ప్ర‌స్తుతం రెండు వ్యాక్సిన్ ల‌ను ఇస్తున్నారు. అవి ఒక‌టి కోవాక్సిన్ రెండోది కోవిషీల్డ్ వ్యాక్సిన్. భార‌త బ‌యోటెక్ కోవాక్సిన్ ను అందుబాటులోకి తీస‌కువ‌చ్చింది. ఇక కోవిషీల్డ్ ను సీరం ఇనిస్టిట్యూట్-ఆక్స్ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ-ఆస్ట్రాజ‌నికా అందుబాటులోకి తీసుకువ‌చ్చాయి. ఇక ఈ రెండు వ్యాక్సిన్ ల‌తో పాటు ఇత‌ర వ్యాక్సిన్ లు కూడా త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్నాయి. ఇయితే ఇప్పుడు అంద‌రిలో ఉన్న సందేహం కోవాక్సిన్ వేసుకోవాలా..? లేదంటే కోవిషీల్డ్ వేసుకోవాలా..? ఈ రెండు వ్యాక్సిన్ లు కూడా వైర‌స్ ను క్రియార‌హితంగా చేయ‌డానికి రూపొందించిన వ్యాక్సిన్ లే. కోవిషీల్డ్ ను సార్స్ కోవ్-2 లోని స్పైక్ గైకోప్రోటీన్ భాగం నుండి తీసుకున్న జ‌న్యుప‌ధార్థంతో త‌యారు చేశారు. ఇది ఒక వైర‌ల్ వెక్ట‌ర్ వ్యాక్సిన్ అంటే మ‌రో వైర‌స్ ను వాహ‌కంగా చేస‌కుని పనిచేస్తుంది. ఇదిలా ఉండ‌గా కోవాక్సిన్ ను సార్స్ కోవ్-2 మొతం తో త‌యారు చేసారు. దీన్ని వైర‌స్ జ‌న్యుప‌దార్థాల‌కు పున‌రుత్ప‌త్తిని లేకుండా అచేతనం చేసి వ్యాక్సిన్ ను త‌యారు చేశారు.

రెండింటిలో ఏ వ్యాక్సిన్ మెరుగైంది :
ఈ రెండు వ్యాక్సిన్ ల‌ను భార‌త్ లోనే త‌యారు చేశారు. అయితే వీటిలో కోవిషీల్డ్ ఎక్కువ దేశాల్లో గుర్తింపు తెచ్చుకుంది. మ‌రోవైపు కోవాక్సిన్ ఇప్పుడు ఉత్ప‌రివ‌ర్త జాతుల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసే ప్ర‌భావ‌వంత‌మైన వ్యాక్సిన్ గా గుర్తించ‌బ‌డుతుంది.

ఎన్నిడోసులు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి:
ఈ రెండు వ్యాక్సిన్ ల‌ను కండ‌రాల‌కు ఇస్తారు. కోవాక్సిన్ మొద‌టి డోసు వేసుకున్న 4-6 వారాల‌కు రెండో డోస్ ఇస్తారు. కోవిషీల్డ్ మొద‌టి డోస్ వేసుకున్న 6-8 వారాల‌కు రెండో డోసును ఇస్తారు.

ఉత్పరివర్తనాల నుండి రక్షణ:
ఈ విషయానికి వస్తే ఉత్పరివర్తనాలకు వ్యతిరేకంగా రెండు టీకాలు ప్రభావవంతంగా ఉన్నాయని ప్రాథమిక పరిశోధనలో తేలింది. అయితే దీని మీద విస్తృతంగా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. మరింత సమాచారం రావలసి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: