శుక్ర కణాల ఉత్పత్తి పెరిగి మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టాలంటే ఈ పద్ధతులు తప్పక పాటించండి...
శుక్రకణాల ఉత్పత్తి పెరగాలంటే ముందుగా స్మోకింగ్, డ్రింకింగ్ మానేయాలి.ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు ఉన్నా సరే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. కొకైన్, అనాబోలిక్ స్టెరాయిడ్స్ తదితర నిషేదిత మాదక ద్రవ్యాలు కూడా స్పెర్మ్ కౌంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి.. వాటి నుంచి దూరంగా ఉండాలి.ఇక టైట్ బట్టలు, జీన్స్ ధరించకండి.వదులుగా ఉండే అండర్‌వేర్లు, ఫ్యాంట్లు మాత్రమే ధరించాలి. కాటన్ అండర్‌వేరులు మాత్రమే ఉపయోగించాలి. సింథటిక్ దుస్తులకు దూరంగా ఉండాలి.మీరు తినే ఆహారంలో పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వులు, ఖనిజ లవణాలు, పీచు, రోగనిరోధక శక్తికి అవసరమైన విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన శుక్రకణాల ఉత్పత్తి పెరుగుతుంది.
దానిమ్మ గింజలు, రసం వల్ల స్పెర్మ్ చురుగ్గా కదులుతుంది. నాణ్యత కూడా పెరుగుతుంది.పుచ్చకాయలో లైకోపేస్, నీటి శాతం పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతాయి.జీడిపప్పు తీసుకోవడం జింక్ పరిమాణం కూడా పెరుగుతుంది. సంతానోత్పత్తి జింక్ చాలా అవసరం.యాపిల్‌లో గుణాలు కూడా మేల్ ఫెర్టిలిటీని పెంచుతాయి. వీర్య కణాల శాతాన్ని గణనీయంగా పెంచుతుంది.ఆహారంలో తప్పకుండా విటమిన్-C ఉండాలి. ఇది వీర్యంలో డీఎన్ఏను కాపాడుతుంది. అతిగా పొగతాగితే విటమిన్-C హరించికుపోయి సంతాన సమస్యలు ఏర్పడతాయి.అరటి పండ్లలోని విటమిన్ B1, C, ప్రోటీన్‌లు ఆరోగ్యానికే కాదు వీర్య కణాలకు కూడా మేలు చేస్తాయి. అరటిలో ఉండే బ్రోమోలేయిన్ శక్తివంతమైన సెక్స్ హర్మోన్‌గా పనిచేస్తుంది. శుక్రకణాల నాణ్యతను సైతం పెంచుతుంది.బరువు వల్ల కూడా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. కాబట్టి స్పెర్మ్ కౌంట్ సమస్యను ఎదుర్కొంటున్న పురుషులు బరువు తగ్గాలి.