ఇయర్ బడ్స్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త సుమీ..!

Divya

ప్రస్తుత కాలంలో టెక్నాలజీకి అనుగుణంగా అన్నీ అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.. వీటి వల్ల మనుషులకు ఏ పని అయినా సులభతరం అవుతుంది.. ఇక వీటి వల్ల ఎలాంటి కష్టం లేకుండా మన పనులన్నీ చక్కగా చక చక చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే ఇదంతా పక్కన పెడితే, చాలామంది చెవిలో గులిమి తీసుకోవడానికి ఇయర్ బడ్స్ ను ఉపయోగిస్తున్నారు.. ఈ ఇయర్ బడ్స్ తో చెవిలో గులిమి తీసుకోవడం అత్యంత ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. అయితే ఇయర్ బడ్స్ తో చెవిలో గులిమి తీసుకోవడం వల్ల కలిగే అనర్ధాలు ఏమిటో,  ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
మనలో ప్రతి ఒక్కరికి ఇయర్ బడ్స్ ఉపయోగించే అలవాటు చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇయర్ బడ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి. స్నానం చేసిన ప్రతి సారి చెవుల్లో నీళ్లు పోతే, ఇయర్ బడ్స్ తోనే క్లీన్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. అంతేకాకుండా చెవిలో కొంచెం చిరాగ్గా అనిపించినా సరే,  వెంటనే ఇయర్ బడ్స్ చెవిలో పెట్టుకొని తిప్పుతూ ఉంటారు.. ఎందుకంటే తక్షణ ప్రశాంతత కలుగుతుంది.. దీనిని ఇలా ప్రతిసారి చెవిలో ఇయర్ బడ్ పెట్టి తిప్పడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి..
సాధారణంగా చెవి లోపలి భాగాలు అత్యంత సున్నితంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా  చెప్పాలంటే చెవిలోపల చర్మం కన్వేయర్ బెల్ట్ లా పని చేసి,లోపలి వ్యర్థాలను బయటకు తోసేస్తుంది. అలా కాకుండా ఇయర్ బడ్స్ ద్వారా చెవి లోపల గులిమి బయటకు తీయాలని ప్రయత్నిస్తే, అది ఇంకా లోపలికి వెళ్లి కర్ణభేరి పై పడుతుందట. అయితే ఇలా ఎక్కువ సంఖ్యలో గులిమి కర్ణభేరి పై పేరుకుపోవడం వల్ల సున్నితమైన కర్ణభేరి, తరంగాలకు అనుగుణంగా ప్రకంపనాలను సృష్టించే సామర్ధ్యం కోల్పోతుంది. క్రమంగా చెవుడు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ..
కాబట్టి మీకు కనుక చెవిలో ఇయర్ బడ్స్ పెట్టి గులిమి తీసే అలవాటుంటే వెంటనే మానుకోండి.. చెవిలో గులిమి తీయడానికి మార్కెట్లో  ఇయర్ బడ్ కి ప్రత్యామ్నాయంగా ఎన్నో అధునాతన పరికరాలు  మనకు లభ్యమవుతున్నాయి. వాటిలో మన చెవిలో గులిమి తీయడానికి అనుకూలంగా ఏవి ఉంటాయో సరిచూసుకొని మరీ తెచ్చుకోవడం ఉత్తమం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: