మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడం లేదా..? అయితే ఇలా చేయండి..

Divya

సాధారణంగా కొంతమంది లో జీర్ణ శక్తి అధికంగా ఉంటుంది. మరికొంతమందిలో ఏం తిన్నా కూడా సరిగ్గా జీర్ణం అవ్వక, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకప్పుడు మన పెద్ద వాళ్ళు కూడా అంటూ ఉండేవారు.. వీడేంటి రా ఏమి తిన్నా కూడా రాళ్ళలాగ కరిగించుకుంటున్నాడు.. వీడు కడుపులో ఏమైనా మెషిన్స్ ఉన్నాయా.. అంటూ కూడా కామెంట్లు చేసే వాళ్ళు.. అయితే మరికొంతమంది ఏం తిన్నా కూడా సరిగ్గా జీర్ణం అవ్వక, ఎన్నో తిప్పలు పడుతూ.. ఏం తిన్నా కూడా అరగక, ఏం తినాలి అన్నా కూడా భయపడుతూ ఉంటారు. సాధారణంగా హెల్త్ బాగుంటే అన్నీ బాగున్నట్టే అంటారు నిపుణులు. గుండె జబ్బుల నుంచి డయాబెటిస్ వరకు హెల్త్ సరిగా లేకపోతే,  అన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని అంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా జీర్ణశక్తి బాగా ఉండాలంటే , ఏం చేయాలో తెలుసా..

వ్యాయామం, యోగా లాంటివి వారానికి 150 నిమిషాల పాటు  చేయడం వల్ల, జీర్ణశక్తి తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మీకు వీలుగా ఉండే ఏ వ్యాయామమైనా సరే, అంటే వాకింగ్ చేయడం, జాగింగ్ చేయడం, సైక్లింగ్ లేదా ఏదైనా స్పోర్ట్స్ ఆడడం వంటివన్నీ వ్యాయామం కిందికే వస్తాయి. కాబట్టి ఇలాంటి వ్యాయామాలు, ఎక్సర్సైజులు చేయడంవల్ల జీర్ణశక్తి మెరుగుపడ్డం తో పాటు ఆరోగ్యంగా ఉంటాము..

ప్రోబయోటిక్స్ ఆహారంలో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. ఆహారంలో భాగంగా పెరుగు, చీజ్, ఇడ్లీ, దోస, పచ్చళ్ళు ఇవన్నీ జీర్ణ శక్తిని పెంపొందిస్తాయి. అంతేకాకుండా బార్లీ, ఆపిల్స్, హోల్ గ్రైన్, క్యారెట్, ఉల్లిపాయలు,వెల్లుల్లి, గోధుమలు ఇవన్నీ కూడా తీసుకోదగినవే..

వీలైనంత వరకు ఆహారంలో షుగర్ పాత్ర తక్కువగా ఉండేలా చూసుకోవాలి. సాఫ్ట్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ లో షుగర్ ఎక్కువగానే ఉంటుంది. వీటిని తగ్గించడం చాలా అవసరం. అలాగే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా జీర్ణశక్తికి హాని కలిగిస్తాయి.


అలాగే హాయిగా నిద్ర పోవడం నేర్చుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. అలాగే డిన్నర్ తర్వాత ఏమీ తినకుండా ఉండాలి. ఆల్కహాల్ తగ్గించుకోవడం చాలా ఉత్తమం.  అంతేకాకుండా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ లకు కూడా దూరంగా ఉండాలి.. ఇలాంటివన్నీ తగ్గించుకుంటే తప్పకుండా జీర్ణశక్తి మెరుగుపడుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: