గ్రీన్ టీ కంటే యాపిల్ టీ నే మంచిదట.. అది ఎలానో తెలుసా..!

Divya

ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం కారణంగా, మనం తినే ఆహారంలో వ్యర్థాల కారణంగా, మన శరీరం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే మన శరీరాన్ని లోపలి నుంచి శుభ్రం చేసుకోవాలంటే దానికి ఒకటే దారి గ్రీన్ టీ.. గ్రీన్ టీ తాగడం వల్ల మన శరీరం శుభ్రం అవుతుంది అని శాస్త్రవేత్తలు కూడా అంటున్న  విషయం మనందరికీ తెలిసిందే. మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తొలగించడానికి ఈ గ్రీన్ టీ సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగిన ఈ గ్రీన్ టీని, నిత్యం తాగడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అని కూడా తెలుసు. అయితే ప్రస్తుతం గ్రీన్ టీ కంటే యాపిల్ టీ ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందని అంటున్నారు నిపుణులు.. అయితే ఏ రకంగా యాపిల్ టీ లో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ముందుగా యాపిల్ టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా శుభ్రంగా కడిగిన ఒక బౌల్ తీసుకొని, స్టౌ మీద పెట్టి టీ కి కావలసిన నీళ్లు పోయాలి. అందులో శుభ్రంగా కడిగిన ఆపిల్ ను తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఆ నీళ్లలో వేసి, 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఆ తరువాత కొద్దిగా టీ పొడి,లవంగం, దాల్చిన చెక్క పొడి వేసి బాగా మరగనివ్వాలి. తరువాత దించి వడకట్టి, తాగేటప్పుడు కొద్దిగా తేనె కలుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి..

ఈ యాపిల్ టీని తాగడం వల్ల  రుచిగా ఉండడంతో పాటు శరీరం ఫిట్‌గా, దృఢంగా  ఉండేందుకు దోహదపడుతుంది. ఇప్పటికే యూరప్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ యాపిల్ టీ రోగనిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు సహాయపడుతుందని వారు ఎక్కువగా  తాగేస్తున్నారట. ప్రస్తుతం కరోనా సమయంలో  కరోనా నుంచి అలాగే  ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో యాపిల్ టీ కీలక పాత్ర పోషిస్తుంది. ఉదర సంబంధ సమస్యలకు ఈ టీ చక్కటి ఔషధం. యాపిల్ టీ రోజూ తీసుకుంటే అందంగా ఉండటమే చర్మం కాంతి వంతంగా ఉంటుందని అంటున్నారు. కీళ్లనొప్పుల  సమస్యలను నివారిస్తుంది. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి మీరు కూడా పైన చెప్పిన విధంగా యాపిల్ టీని చేసుకుని తాగడానికి ప్రయత్నం చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: