మాంసాహారం తిన్న తర్వాత బాదం పప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
సాధారణంగానే ప్రతిరోజు ఉదయం నానబెట్టిన బాదం పప్పు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి అనే విషయం మనకు తెలిసినదే. ఇకపోతే మాంసాహారం తిన్న తర్వాత తప్పకుండా బాదంపప్పు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. బాదం పప్పులు ఎక్కువభాగం క్యాల్షియం మనకు లభిస్తుంది.ఈ విధంగా బాదం పప్పు తినడం వల్ల అధిక కొవ్వు కలిగినటువంటి మాంసాహార పదార్థాల నుంచి మన గుండెకు వచ్చే ప్రమాదాలను తగ్గించడంలో బాదంపప్పు సహాయపడుతుందని చెప్పవచ్చు.
బాదంలో ఎన్నో పోషక గుణాలు దాగి ఉన్నాయనే విషయం మనకు తెలిసినదే. ఇందులో ఉన్నటువంటి విటమిన్ ఈ మన ఆహార నాళం ఆరోగ్యంగా ఉండటం కోసం దోహదపడుతుంది. అదేవిధంగా మన శరీరంలో ఏర్పడే మంటను తగ్గించడంలో కూడా ఈ బాదంపప్పు దోహదపడుతుంది. బాదంపప్పులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలను నివారిస్తూ, మలబద్ధకం సమస్యను తగ్గించు కోవచ్చు.అయితే చాలామంది ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన బాదం పప్పు పై ఉన్న పొట్టును తొలగించి తింటూ ఉంటారు. అలా చేయడం సరైనది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. బాదం పై పొట్టులో అధికభాగం పోషక పదార్థాలు ఉంటాయని, పొట్టుతో సహా బాదం తిన్నప్పుడు మాత్రమే మనకు అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ప్రతి రోజూ 4 నుంచి 5 బాదంలను మాత్రమే తినాలి.