కొంబుచా టీ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా..?
పూర్తి వివరాల్లోకి వెళితే ఈ కొంబుచా టీ మొదటిసారిగా రష్యా లో తయారు చేయబడిందని చెబుతారు. అయితే వీటికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. అయితే కొన్ని వందల సంవత్సరాల నుండి వీటిని అనేక దేశాలలోని కొన్ని జాతులకు చెందిన ప్రజలు సేవిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ టీ ఇతర దేశాలకు కూడా పాకి, అందరూ ఈ టీని తాగడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ టీ తాగడానికి రుచికరంగా కూడా ఉంటుందట..
కొంబుచా టీ లో పాలతో పాటు పాల సంబంధిత ఉత్పత్తులలో ఉండే పోషకాలు ఉంటాయట. ముఖ్యంగా ఈ టీలో ఉండే ప్రో బయోటిక్, మన శరీరంలో ఉండే జీర్ణాశయం తో పాటు పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంపొందిస్తుంది. తద్వారా జీర్ణసంబంధిత సమస్యలు రాకుండా ఉండడమే కాకుండా జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఫలితంగా జీర్ణాశయ సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ కొంబుచా టీ నిత్యం తాగడం వల్ల కొలెస్ట్రాల్ ను తగ్గించి, అధిక బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు . అంతేకాకుండా గుండె జబ్బులు కూడా నయం అవుతాయి. టైప్ 2 డయాబెటీస్ ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు తగ్గి, డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. అలాగే క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఈ టీలో ఉన్నాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనం ద్వారా వెల్లడైంది...