అసలు ప్యాకెట్ పాలలో ఏం కలుపుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...
పల్లె ప్రాంతాలలో అయితే పశువులను మేపుతూ, వాటి ద్వారా వచ్చే పాలను జీవనాధారంగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ప్రస్తుత కాలంలో పాల ఉత్పత్తి చేయడానికి మార్కెట్లో ఎన్నో రకాల సంస్థలు ఏర్పడ్డాయి. ఇవి ప్యాకెట్ రూపంలో పాలను విక్రయించడం జరుగుతోంది. అయితే ఈ ప్యాకెట్ పాలు మనకు మంచివేనా?కాదా ? నిజానికి ప్యాకెట్ పాలు విడిగా దొరికే పాలలాగే ఉంటాయా? ప్యాకెట్ పాలలో చిక్కదనం కోసం ఏవేవో రసాయనాలు కలుపుతున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి? ఇందులో ఏది నిజం. ఒకవేళ పాలు విడిగా దొరకకపోతే ప్యాకెట్ పాలే గతి అవుతాయి కదా..! అని మీరు ఆలోచిస్తున్నారా..? అయితే ఇందులో ఏవి మంచివో ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ చూసి తెలుసుకుందాం..
ప్యాకెట్ పాలు :
ప్యాకెట్ పాలు కొనేవారిలో, ఎంతమంది ఈ పాలను ఎలా తయారు చేస్తారు? ఎలా నిలువ ఉండేలా చేస్తారు? అనేది మాత్రం ఎవరూ పట్టించుకోరు. బ్రాండ్ ని బట్టి, దాని పాపులారిటీని బట్టి పాల క్వాలిటీని నమ్మేస్తున్నారు, అలాగే కొనేస్తున్నారు. కానీ ఒక పూట లేదా ఒక రోజుకే చెడిపోయే పాలను ఏ బ్రాండ్ అయినా పాకెట్స్ రూపంలో ఎలా నిల్వ చేయగలదు? వాటిలో వాడే రసాయనాలు ఏమిటి అనేది ఎవరూ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. అయితే ప్యాకెట్ పాలలో లభించే ప్రతి బ్రాండ్ కూడా పాలను పాశ్చరైజేషన్ పద్ధతి ద్వారా ప్యాకెట్లలో నిల్వ చేస్తారు.
ఇలా బ్రాండ్ గా వచ్చే ప్రతి సంస్థకు ఆవుల తోపాటు గేదెల పెంపకం ఖచ్చితంగా ఉంటుంది.ఇది వేల సంపదను కలిగి ఉంటుంది. అయితే పాల ఉత్పత్తి కోసం, పశువులకు నాణ్యమైన దానవే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ హార్మోన్లను ఇంజెక్ట్ చేయడం ద్వారా కూడా పాల ఉత్పత్తిని పెంచవచ్చని సరికొత్తగా ఒక అధ్యయనం ద్వారా తెలిసింది. అయితే ఇలా ప్యాకెట్ పాలను కొని, వాడడం వల్ల పాలల్లో పోషకాలన్నీ అందుబాటులో ఉంటాయా అనే నమ్మకం లేదు. మరికొన్ని పాల ఉత్పత్తి తయారీ సంస్థలు,పాలు చిక్కదనం రావడానికి పాల పొడితో పాటు కొన్ని రసాయనాలను కూడా కలుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
విడిగా దొరికే పాలు :
విడిగా దొరికే పాలు గ్రామీణ ప్రాంతాల్లో మనకు తరచూ కనిపిస్తుంటాయి. అప్పట్లో అయితే ఇంటికి వచ్చి మరీ పాలు అమ్మే వాళ్ళు. కానీ ప్రతి గ్రామంలో సహకార డైరీలు ఏర్పాటు చేయడంవల్ల ఆ సహకారం డైరీలు పాలను సేకరించి, అమ్మడం మొదలు పెట్టాయి. అయితే ఇందులో వచ్చిన చిక్కంతా నీళ్లు కలపడం. ఇక ఈ పాలలో నీళ్లు కలపడం వల్ల వినియోగదారులు ఈ పాలను కొనడానికి ఇష్టపడరు. ఇలాంటి పాలలో కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటుంది. అయితే ప్యాకెట్ పాలు లాగా వీరు పశువులకు పాల ఉత్పత్తి కోసం హార్మోన్ ఇంజెక్ట్ చేయరు. అయితే విడిగా దొరికే పాలలో కొద్దిగా నీళ్లు కలిపినప్పటికీ ఈ పాలే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు
అయితే పోను పోను ప్యాకెట్ పాలల్లో దీర్ఘకాలిక సమస్యలు ఏర్పడే అవకాశం కూడా రావచ్చు. కాబట్టి ప్యాకెట్ పాల కన్నా విడిగా దొరికే పాలు శ్రేయస్కరం .