ఈ చిట్కాలతో ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చు...

kalpana
 వేసవికాలంలో ఎండలు మండిపోతుంటాయి ఉక్క పోతా కూడా ఎక్కువగా ఉంటుంది. వడగాలులు ఎక్కువగా వస్తుంటాయి. చెమటలు అధికంగా వస్తుంటాయి. వీటన్నింటి నుండి ఉపశమనం పొందడానికి ఈ చిట్కాలను ఉపయోగించి ఉపశమన పొందచ్చు.

 వేసవికాలంలో ఉసిరికాయను ఈ రోజు తినడం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరు పోకుండా చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి కావలసిన విటమిన్ సి ని  కూడా అందిస్తుంది.                                       

 వేసవికాలంలో ఎక్కువగా తలనొప్పి వస్తుంటుంది. అంతేకాకుండా వికారాలు, ఒత్తిడి నీరసం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి వాటికి పుదీనా ఆకులను తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి.పుదీనా ఆకులను సలాడ్ రూపంలో గాని, చట్నీ రూపంలో గాని తీసుకోవచ్చు ఎలా తీసుకున్న ఉపయోగం ఉంటుంది.

 ఎండాకాలంలో గుప్పెడు తులసి ఆకులను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినవిటమిన్ ఏ బాగా అందుతుంది. అంతేకాకుండా రక్త హీనత లేకుండా చేస్తుంది.ఫలితంగా వికారం, తల నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

 వేసవికాలంలో గులాబీ రేకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఆ పొడితో టీ తయారు చేసుకొని తాగడం వల్ల వేడి నుండి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా డయేరియా వంటి సమస్యలు తగ్గుతాయి.

 ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ గాని గొడుగు గాని తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఎండ నిటారుగా పడి తల నొప్పి వచ్చే అవకాశం ఉంది.

 ఎండాకాలము ఎన్ని నీళ్లు తాగిన దాహం మాత్రం తీరదు. అలాంటి సమయంలో నిమ్మకాయ రసంలో పంచదార కలుపుకొని తాగడం వల్ల దాహం తీరుతుంది.

వేసవిలో తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది. నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి, కొబ్బరి నూనెలో రెండు చుక్కలు నీళ్లు పోసి మాడుపై మర్దనా చేయడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: