నిద్రలేమి వల్ల ఎంత ప్రమాదమో చూడండి !
ఈ కారణాల్లో నిద్రలేమి వల్ల బాధపడేవారే ఎక్కువగా టైప్-2 డయబెటీస్‌కు గురయ్యే ప్రమాదం ఉందని అధ్యయనంలో పేర్కొన్నారు. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు టైప్ డయబెటీస్ మీద పబ్మెడ్ డేటా బేస్‌లోని 1,360 ఆర్టికల్స్‌ను స్టడీ చేశారు.
ఇందులో భాగంగా 34 అంశాలను కనుగొన్నారు. వీటిలో 19 ముప్పు కలిగించే కారకాలు, 15 ప్రొటెక్టీవ్ మేలు చేసేవి విషయాలను తెలుసుకున్నారు. ఇన్సోమ్నియా (నిద్రలేమి) సమస్యతో బాధపడుతున్నవారిలో టైప్-2 డయబెటీస్ వచ్చే అవకాశాలు 17 శాతం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఇప్పుడున్న ప్రతికూల అంశాల్లో డయబెటీస్‌కు దారి చేసే ప్రధాన ముప్పుగా ఇన్సోమ్నియా అని తెలిపారు.
నిద్రలేమి తర్వాత.. పగటి వేళ్లలో నిద్రపోవడం, మద్యసేవనం, బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం, కోడి నిద్ర, యురినరీ సోడియం లెవెల్స్, అమీనో యాసిడ్స్ తదితర కారణాలు టైప్-2 డయబెటీస్‌కు దారితీయొచ్చని కొన్ని పరిశోధనలో పేర్కొన్నారు.
కాబట్టి అందరు తప్పనిసరిగా రాత్రి పూట నిద్ర పోవాలి. ఒకేవేళ నిద్ర రాకపోయినా కాని కళ్ళు మూసుకోవాలి. ఎందుకంటే ఒక రెండు గంటల పాటు నిద్ర వచ్చిన రాకపోయినా కళ్ళు మూసుకోవాలి. అప్పుడు ఆటోమాటిక్ గా నిద్ర వస్తుంది. కాబట్టి పగలు నిద్ర పోయే అలవాటు ఉంటే తక్షణమే మానుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.