ఆరోగ్యం: అలాంటివారు బాదంప‌ప్పు తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

Kavya Nekkanti

బాదం పప్పు.. ఇవి తెలియ‌ని వారుండ‌రు. అనేక వంట‌కాల్లో వాడే బాదంలో మ‌న శ‌రీరానికి కావాల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వైద్యులు కూడా బాదం డైట్‌లో చేర్చుకోమ‌ని చెబుతున్నారు. బాదంలో అనేక న్యూట్రీషియన్స్ , విటమిన్స్ , ఫైబర్, మెగ్నీషియం, ఓమేగా3 ఫ్యాటీయాసిడ్స్, ప్రోటీన్స్ అత్యధికంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పది బాదం పప్పుల చొప్పున వారంలో ఐదుసార్లు తీసుకొంటే గుండె జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని నిపుణులు అంటున్నారు.

అలాగే అనేక రోగాల‌తో పోరాడే రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలోనూ బాదం గ్రేట్‌గా ప‌నిచేస్తుంది. మధుమేహంతో బాధపడేవారు భోజనం తర్వాత‌ నాలుగు బాదం ప‌ప్పులు తీసుకుంటే శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి కూడా బాదం త‌మ డైట్‌లో చేర్చుకోవాలి. ఎందుకంటే.. బాదంలో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్, ఎక్కువ సమయం పొట్ట ఫుల్ గా ఉంచుతుంది. ఆకలి తగ్గిస్తుంది. త‌ద్వారా బ‌రువు త‌గ్గొచ్చు. అయితే తమ ఆరోగ్య స్థితిని దృష్టిలో పెట్టుకుని బాదం గింజలను తీసుకోవాల‌ని అంటున్నారు నిపుణులు.

ఎందుకంటే.. కొంతమంది నట్ ఎలర్జీతో బాధ‌ప‌డుతుంటారు. ఇలాంటి వారికి బాదంప‌ప్పు తిన్న‌ప్పుడు దద్దుర్లు, వాపు, బ్రీథింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నట్స్ ను తిన్న ప్రతిసారి ఈ లక్షణాలు కనిపిస్తే.. అలాంటి వారు బాదంకు దూరంగా ఉండ‌ట‌మే మంచిది. అలాగే లాక్సాటిప్స్ వాడుతున్నవారు, యాంటీబయటిక్ మెడిసిన్స్ ను వాడుతున్నవారు నిపుణుల‌ను సంప్రదించి.. బాదం గింజలను తీసుకోవాలి. ఎందుకంటే.. బాదం గింజల్లో మ్యాంగనీజ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మెడిసిన్స్ వల్ల కలిగే ఫలితాల్ని తగ్గిస్తుంది. ఇక బాదం ఆరోగ్యానికి మంచిదే.. కానీ, అతిగా తీసుకుంటే  కిడ్నీలో రాళ్లు, మలబద్ధకం, అధిక బ‌రువు వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. సో.. బీకేర్‌ఫుల్‌!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: