లైంగిక లోపాలను, బలహీనతలను పోగొట్టే పండు ఇదే...!
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అంజీర పండు కొంచెం తీపి, కొంచెం వగరు, కొంచెం పులుపుగా ఉంటుంది. మేడిపండును పోలి ఉండే అంజీర పండులో అద్భుతమైన రుచితో పాటు పోషక విలువలు కూడా ఉన్నాయి. అంజీర పండు లైంగిక బలహీనతలను తగ్గిస్తుంది. ఈ పండ్లు దాంపత్యకార్యంలో పాల్గొనే వారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. లైంగిక వ్యాధులను తగ్గించడంలో కూడా ఈ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి.
పిల్లలు లేని వారికి లైంగిక సామర్థ్యం పెంచడంలో అంజీర పండ్లు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. అంజీర పండ్లలో ఎక్కువ మోతాదులో కాల్షియం ఉంటుంది. ప్రతిరోజు అంజీర పండ్లు తినే వారిలో ఎముకలు బలపడతాయి. అంజీరలో ఉండే పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. రక్త హీనత సమస్యను తగ్గించటానికి అంజీర పండ్లు దివ్య ఔషధంగా పని చేస్తాయి. అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో అంజీర పండు సహాయపడుతుంది.
కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులను అంజీర పండు అదుపులో ఉంచుతుంది. అంజీర పండు క్రమం తప్పకుండా తినే వారిలో కిడ్నీలోని రాళ్లు కూడా కరుగుతాయి. అంజీర పండ్లను నీళ్లలో నానబెట్టి తలకు మర్ధన చేయటం వలన తలలో చుండ్రు తగ్గిపోతుంది. టైప్ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో కూడా అంజీర పండ్లు సహాయపడతాయి. ఆడపిల్లలు రోజు అంజీర పండ్లు తింటే మొటిమలు తగ్గి ఆకర్షణీయంగా తయారవుతారు. వృద్ధాప్యం వలన వచ్చే దృష్టి లోపాలను అంజీర పండ్లు తగ్గిస్తాయి. నిద్రలేమి సమస్యతో బాధ పడే వారు అంజీర పండ్లను తింటే నిద్రలేమి సమస్య దూరమవుతుంది.