చరిత్రలో ఈరోజు : 29-07-2020 రోజున ఏం జరిగిందంటే..?

praveen

జూలై 29 వ తేదీన ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో  తెలుసుకుందాం రండి. 

 

 జె.ఆర్.డి.టాటా జననం : భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త తొలి విమాన చోదకుడు అయిన జె.ఆర్.డి.టాటా 1904 జూలై 29 వ తేదీన జన్మించారు. ఫ్యారిస్ లో జన్మించిన ఈయన.... భారతదేశంలో మొట్టమొదటి పైలెట్ గా  లైసెన్స్ పొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. భారతదేశపు తొలి వాణిజ్య విమాన సేవలను టాటా ఎయిర్ లైన్స్ పేరుతో ప్రవేశపెట్టారు జెఆర్డీ  టాటా. ఆ తర్వాత 1946లో అది ఎయిర్ ఇండియాకు రూపాంతరం చెందింది. ఆ తర్వాత కాలంలో ఆయన భారతదేశపు పౌరవిమానయాన పితామహుడిగా కూడా ప్రశంసించబడ్డాడు . 1992 లో ఈయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేసింది. 

 

 సినారె జననం : ప్రఖ్యాత తెలుగు కవి సాహితీవేత్త తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేసిన వ్యక్తి అయిన  సినారె పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి. తన కవిత్వంతో రచనలతో ఎంతోమందిని ప్రభావితం చేశారు. 1931 జూలై 29 వ తేదీన జన్మించారు ఈయన. తెలుగు  సాహిత్య అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగంలో సినారే రాసిన పాటలు సినీ ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆయన కలం నుంచి జాలువారిన పద్య కావ్యాలు గేయ కావ్యాలు ప్రేక్షకులు అందరినీ ఎంతగానో రంజింపజేసాయి. 

 

 కృష్ణుడు జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అయిన కృష్ణుడు 1975 జూలై 29 వ తేదీన జన్మించారు. తన భారీ కాయంతో తనదైన ప్రత్యేక శైలిలో నటుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించారు కృష్ణుడు. పలు  సినిమాల్లో  ప్రముఖ పాత్రలు పోషించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. హ్యాపీ డేస్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల అందరికీ ఎంతగానో దగ్గరయ్యారు కృష్ణుడు. ఆ తర్వాత వినాయకుడు అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. 

 

 సంజయ్ దత్ జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన సంజయ్ దత్ 1959 జూలై 29 వ తేదీన జన్మించారు. సంజయ్ దత్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతగానో  గుర్తింపు సంపాదించారు. హిందీ బాషల్లోనే కాకుండా తెలుగు తమిళ భాషల్లో కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు . 1981లో రాఖీ అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమై ప్రేక్షకులందరికీ ఫేవరెట్ నటుడిగా మారిపోయాడు. సంజయ్ దత్ నటించిన సినిమాల్లో  ఎక్కువగా పాపులారిటీ తెచ్చింది మున్నాభాయ్ సినిమా. అందుకే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంజయ్ దత్ ను  మున్నాభాయ్ అని పిలుస్తూ ఉంటారు. 

 

 సోనియా దీప్తి జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అయిన సోనియా దీప్తి 1984 జూలై 29 వ తేదీన జన్మించారు. 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాలో సీనియర్ పాత్రలో నటించిన సోనియా దీప్తి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత కృష్ణుడు ప్రధాన పాత్రలో తెరకెక్కిన వినాయకుడు సినిమాలో  హీరోయిన్ రోల్ చేశారు సోనియా. ఇలా పలు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించారు. 

 

 ముఖేష్ గౌడ్ మరణం : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నేత అయిన ముఖేష్ గౌడ్... 2019 జూలై 29 వ తేదీన పరమపదించారు. గోషామహల్ శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనసభలో అడుగు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 1989 2004 సంవత్సరంలో మహారాజ్ ఘంజ్  నుంచి కూడా రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ హయాంలో మార్కెటింగ్ శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ముఖేష్ గౌడ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: