నల్ల గోధుమలు: ఆరోగ్యానికి బోలెడు లాభాలు?

Purushottham Vinay
గత కొంతకాలంగా నల్ల గోధుమల వినియోగం అనేది బాగా ఎక్కువ అయింది.పైగా ఈ నల్ల గోధుముల ధర మాములు గోధుమల ధర కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా అంతేకాదు పోషకాలు కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి.ఇంకా చెప్పాలంటే ఈ నల్ల గోధుమలు షుగర్ పేషేంట్స్ కు ఒక వరం లాంటివని పోషకార నిపుణులు చెప్పారు.ఇక ఈ నల్ల గోధుమలతో తయారు చేసిన రొట్టెలను తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా చాలా ఈజీగా అదుపులో ఉంటాయని పేర్కొన్నారు.ఈ నల్ల గోధుమలలో ప్రొటీన్‌తో పాటు మెగ్నీషియం ఇంకా ఐరన్ కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి. నల్ల గోధుమ ఆహారాన్ని తీసుకోవడం వలన రక్తహీనత సమస్య కూడా చాలా ఈజీగా తగ్గుతుంది.అందుకే ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే నల్ల గోధుమలను వారంలో రెండు సార్లు తినటానికి ప్రయత్నం చేయండి.అయితే ఈ నల్ల గోధుమల పంట కొంచెం ఖర్చుతో కూడుకుంది. ఇంకా అంతేకాదు అనేక పోషక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నల్ల గోధుమల ధర మార్కెట్‌లో సాధారణ గోధుమలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఇక సాధారణ గోధుమ ధర మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.2,000 ఉంటే.. నల్ల గోధుమ ధర వచ్చేసి క్వింటాల్‌కు ఏకంగా రూ.7-8 వేల వరకు ఉంటుంది.


ఈ నల్ల గోధుమలలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాలు గుండెను చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా అలాగే రక్తప్రవాహం బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.నల్ల గోధుమలలు శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉండడం వల్ల త్వరగా ఆకలి వేయదు.ఇవి ఈజీగా బరువు తగ్గటానికి సహాయపడతాయి.ఈ నల్ల గోధుమలు క్యాన్సర్‌ను నయం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయట. అధిక బరువును అదుపులో ఉంచుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించే గుణం కూడా ఉందని పేర్కొన్నారు.ఈ నల్ల గోధుమలలో గ్లూటెన్ తక్కువగా ఉంటుంది. ఫైబర్, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, బి విటమిన్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, కాల్షియం, ఐరన్, కాపర్ ఇంకా పొటాషియం వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నల్ల గోధుమ పిండితో పుల్కా, చపాతీ, పరాఠా ఇంకా బ్రెడ్ ఇలా ఏ రూపంలో ఉన్నా శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: