రాగితో ఇది చేసుకొని తింటే ఎంతో ఆరోగ్యం?

Purushottham Vinay
రాగి పిండితో మనం రుచికరమైన ఎన్నో రకరకాల వంటకాలను ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం. రాగులు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయనే విషయం మనకు తెలిసిందే.వీటిలో మన శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఉంటాయి. రాగుల వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. రాగులను పిండిగా చేసి మనం జావ, సంగటి ఇంకా రొట్టె ఇలా రకరకాల పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. ఇక రాగులతో చేసుకోదగిన రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన ఇతర వంటకాల్లో రాగి చిమిలి కూడా ఒకటి. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఛాయా మంచి ఫలితం ఉంటుంది.పాత కాలంలో దీనిని ఎక్కువగా తయారు చేసేవారు. పిల్లల నుండి పెద్దల దాకా ఎవరైనా దీనిని తినవచ్చు.


రక్తహీనతను దూరం చేసే రాగి చిమిలిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఫస్ట్ గిన్నెలో రాగి పిండిని తీసుకోని ఆ తరువాత ఇందులో ఉప్పు ఇంకా తగినన్ని నీళ్లు పోసి పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా పిండిని తీసుకుని నెయ్యి రాసిన అరటి ఆకు మీద ఉంచి పలుచని రొట్టెలాగా వత్తుకోవాలి. ఇక ఆ తరువాత స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి. ఆ పెనం వేడయ్యాక రొట్టెను పెనం మీద వేసి కాల్చుకోవాలి. దీనిపై నెయ్యిలేదా నూనె వేస్తూ రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. ఈ రొట్టె కాలడానికి 8 నుండి 10 నిమిషాల టైం పడుతుంది. ఇలా రాగి రొట్టెను కాల్చుకున్న తరువాత వీటిని ఆవిరి పట్టకుండా జల్లి గిన్నెలో వేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో పల్లీలు వేసి వాటిని దోరగా వేయించాలి.


ఆ తరువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి జార్ లోకి వేసుకోవాలి.అలాగే ఇందులోనే యాలకులు కూడా వేసి బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోని ఆ తరువాత రాగి రొట్టెలను ముక్కలుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి.వీటిని బాగా మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఆ తరువాత కొద్దిగా పిండిని అడుగున ఉంచి మిగిలిన పిండిని గిన్నెలోకి తీసుకోని ఇదే జార్ లో తగినంత తాటి బెల్లం కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న రాగి రొట్టెలు, బెల్లం ఇంకా పల్లీల పొడినంతటిని గిన్నెలో వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక వీటిని లడ్డూలుగా చుట్టుకోవచ్చు లేదా నేరుగా గిన్నెలో వేసుకుని అయినా కూడా తినవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే రాగి చిమిలి తయారవుతుంది. అయితే డయాబెటిస్ ఉన్న వారు ఇందులో బెల్లం వేయకుండా కేవలం కారం పొడితో కలిపి తీసుకోవచ్చు. ఇది బయట ఉంచడం వల్ల రెండు రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది. అదే ఫ్రిజ్ లో ఉంచి స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: