అంజీర్ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు?

Purushottham Vinay
అంజీర్ పండులో చాలా పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. తీపి వంటకాల్లో అంజీర్ పండ్లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి చాలా చక్కని రుచిని కలిగి ఉంటాయి. అంజీర్ పండుని తినడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందవచ్చు.ఈ పండులో కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి చాలా పోషకాలు ఉంటాయి. అంజీర్ ను ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. ఇంకా అలాగే దీన్ని పాలల్లో కూడా నానబెట్టి తీసుకోవచ్చు. అయితే అంజీర్ ను నానబెట్టకుండా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి చేస్తుంది. అందుకే అంజీర్ పండును నానబెట్టి మాత్రమే తీసుకోవాలి. ఇలా రోజూ అంజీర్ పండును నానబెట్టి తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా ఇంకా ఆరోగ్యంగా ఉంటాయి. గుండె ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. అంజీర్ ను తినడం వల్ల శరీరంలో మలినాలు ఈజీగా తొలగిపోయి శరీరం బాగా శుభ్రపడుతుంది. ఇంకా అంతేకాకుండా అంజీర్ ను నానబెట్టి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది.


దీనిలో ఉండే ఫైబర్ పొట్టను శుభ్రం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా అలాగే దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంజీర్ పండును రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు ఇంకా భుజాల నొప్పులు తగ్గుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి. అదే విధంగా అంజీర్ ను తినడం వల్ల బరువు కూడా ఈజీగా తగ్గవచ్చు. చర్మం ఇంకా జుట్టు ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. అలాగే నిద్రలేమి సమస్య తగ్గుతుంది. గొంతు నొప్పిని తగ్గించడంలో కూడా అంజీర్ మనకు సహాయపడుతుంది. రోజూ రెండు లేదా మూడు అంజీర్ లను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: