థైరాయిడ్ ని అదుపులో ఉంచే హెల్తీ టిప్స్?

Purushottham Vinay
మందులతో పని లేకుండా ఇప్పుడు చెప్పబోయే టిప్స్ పాటించడం వల్ల థైరాయిడ్ ఖచ్చితంగా అదుపులో ఉంటుంది. థైరాయిడ్ ను నియంత్రించే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచడంలో కొబ్బరి నూనె మనకు చాలా బాగా సహాయపడుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు కొబ్బరి నూనెను వాడడం వల్ల థైరాయిడ్ సమస్య చాలా ఈజీగా అదుపులో ఉండడంతో పాటు అధిక బరువు సమస్య నుండి కూడా  బయటపడవచ్చు.ప్రతి రోజూ ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను ఒక గ్లాస్ వేడి నీటిలో లేదా ఒక గ్లాస్ పాలల్లో కలిపి తాగాలి లేదా అన్నం మొదటి ముద్దలో దీన్ని కలిపి తీసుకోవాలి. ఇలా కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య చాలా ఈజీగా అదుపులో ఉంటుంది.అలాగే థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచడంలో పెరుగు కూడా మనకు ఎంతో సహాయపడుతుంది.  ప్రతిరోజూ ఒక కప్పు పెరుగును తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ సమస్య చాలా అదుపులో ఉంటుంది. అదే విధంగా కొత్తిమీరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ సమస్య ఈజీగా తగ్గు ముఖం పడుతుంది.


వారానికి రెండు నుండి మూడుసార్లు 50 ఎమ్ ఎల్ కొత్తిమీర జ్యూస్ ను తాగడం వల్ల కూడా ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ సమస్య ఈజీగా అదుపులో ఉంటుంది. దీనిలో ఉండే ఔషధ గుణాలు థైరాయిడ్ ను అదుపులో ఉంచడంలో మనకు చాలా బాగా సహాయపడతాయి. అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు అల్లాన్ని తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. అల్లం టీ లో, తేనె ఇంకా నిమ్మరసంతో కలిపి తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య చాలా ఈజీగా తగ్గు ముఖం పడుతుంది. ఇంకా అలాగే పాలకూర జ్యూస్ ను తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ సమస్యను మనం ఈజీగా తగ్గించుకోవచ్చు.పాలకూరను ఒక 5 నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచాలి. తరువాత దీనిని జార్ లో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.ఆ తరువాత ఈ జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో నిమ్మరసం వేసి బాగా కలిపి తాగాలి.ఇలా తాగడం వల్ల థైరాయిడ్ సమస్య చాలా ఈజీగా తగ్గు ముఖం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: