గుండె జబ్బులని తగ్గించే సూపర్ పద్ధతి ఇదే?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో మనల్ని ఎంతగానో వేధిస్తున్న సమస్యల్లో గుండె జబ్బు ఒకటి. ఈ గుండె జబ్బులకు ఉపవాసంతో చాలా ఈజీగా చెక్ పెట్టవచ్చంట. మన శరీరంలో కొవ్వు శాతం పెరగడం కారణంగానే ఇలా జరుగుతుండగా.. ఫాస్టింగ్ అనేది శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతూ ఖచ్చితంగా ప్రమాదాన్ని నివారిస్తుంది.నచ్చిన సమయంలో అనుసరించే ఇలాంటి ఉపవాసం వల్ల కేవలం గుండె ఆరోగ్యమే కాకుండా ఇంకా ఇతర చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఇక సమయానికి తిన్నా, తినకపోయినా.. వ్యాయామం చేసినా, చేయకపోయినా.. ఈ రోజుల్లో గుండె జబ్బు మరణాలు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. అందుకే తీసుకునే ఆహారం మూలంగా కొలెస్ర్టాల్ పేరుకుపోయి గుండెకు ప్రమాదం చేకూరకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఉపవాసం ఉండటం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఎందుకంటే దీని వల్ల బాడీలోని ఇన్సులిన్ హార్మోన్‌కు మన శరీరం స్పందించే విధానం ఖచ్చితంగా బాగా మెరుగుపడుతుంది. అలాగే మన శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను కూడా సమతుల్యం చేస్తుంది.


ఇంకా కొలెస్ట్రాల్‌, అధిక బరువు ఇంకా డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా ఈజీగా అరికడుతుంది.ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది కేవలం సమయ పరిమితితో కూడిన ఆహారం. ఉదయం పూట 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆహారం తీసుకోకుండా ఉండటం ఒక పద్ధతి అయితే, ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మరో పద్ధతి. ఇంకా అలాగే ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల మధ్య ఒకసారి తింటూ ఉపవాసం ఉండటం కూడా మీరు చేయవచ్చు. మొత్తానికి ఇది 12 గంటల ఉపవాసమని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.ఇలా ఉపవాసం చేస్తే గుండె ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది.ఇంకా అలాగే గుండెపోటు, స్ట్రోక్స్, లేదా కరోనరీ ఆర్టరీ వ్యాధుల ప్రభావం కూడా ఉండదు.అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గించి, డయాబెటిస్ వల్ల వచ్చే ప్రమాదాలను ఈజీగా నివారిస్తుంది.అలాగే అధిక మాంసకృత్తులు, కొవ్వులు ఇంకా ఫైబర్స్ వంటివి శరీరంలో సమతుల్యంగా ఉంటాయి.ఇంకా ఉపవాసంలో పుష్కలంగా నీరు త్రాగడం ద్వారా కూడా హైడ్రేటెడ్‌గా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: