స్త్రీలలో గుండెపోటు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..!!

Divya
సాధారణంగా గుండెపోటు ఆడవారిలో కన్నా మగవారిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీనికి కారణం ఋతుక్రమం వల్ల మన శరీరంలోని హార్మోన్స్ ని మరియు రక్తంలో క్రమబద్ధీకరిస్తూ ఉంటాయి.గుండె సంబంధిత రోగాలు రావడానికి స్త్రీలలో మాత్రమే వచ్చే పాలిసిస్టిక్ అండాశయ వ్యాధులు, డయాభేటీస్, హైబీపీ, ఎండో మెట్రియోసిస్ వంటివి ఎక్కువ దోహదం చేస్తాయి. అలాంటివారు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల, గుండెపోటు రాకుండా నివారించుకోవచ్చు.అలాంటి ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు..
ప్రోటీన్ ఎక్కువగా  ఉన్న చిక్కుళ్ళు,గ్రుడ్లు,మాంసము, పుట్టగొడుగులు వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. గుండె ఆరోగ్యానికి ప్రోటీన్ ఎంతో చాలా అవసరం. కనుక ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గుండె సంబంధిత రోగాలను దరిచేరకుండా కాపాడుకోవచ్చు.
పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు:
రోజువారీ ఆహారంలో పొటాషియం తీసుకోవడం వల్ల హార్ట్ బీట్ చక్కగా ఉంటుంది.బీపీ, గుండె కండరాల సిస్టలీక్ ప్రెసర్ స్థిరంగా ఉంచుతుంది. అరటిపండు, అవకాడో, గుమ్మడికాయలో శరీరానికి కావాల్సిన పోటాషియం అధికంగా లభిస్తుంది.
 డ్రై ఫ్రూట్స్ :
డ్రై ఫ్రూట్స్ రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.ఇందులోని విటమిన్ ఈ రక్తనాళాల్లో రక్తము గడ్డ కట్టకుండా ఉపయోగపడుతుంది.
వెల్లుల్లి:
వెల్లుల్లిని తరుచూ తీసుకోవడం వల్ల, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొందరగా కరిగిస్తాయి.అంతే కాక సహజంగా రక్తాన్ని గడ్డ కట్టకుండా చేసి,సక్రమంగా రక్త సరఫరా జరగేలా సహాయపడతాయి.మరియు మధుమేహాన్ని  కంట్రోల్ లో ఉంచుతుంది.
ఆలివ్ ఆయిల్:
రక్తంలో చెడు కొవ్వులను కరిగించి, గుండె స్పందన సక్రమంగా జరిగేలా చేసే ఆహారాల్లో ఆలివ్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడతాయని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
తృణధాన్యాలు:
వీటిని తరుచూ తీసుకోవడం వల్ల, శరీరానికి కావాల్సిన ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కళంగా లభిస్తాయి.గుండె చుట్టూ పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగించి,గుండె జబ్బులు రాకుండా సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: