కీళ్లలో గుజ్జు పెరిగి కీళ్ళ నొప్పులు తగ్గాలంటే..?

Purushottham Vinay
మోకాళ్ల నొప్పులు ఇంకా అలాగే కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడే వారు నువ్వులను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో నువ్వులు ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తాయి. నువ్వులను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత క్యాల్షియం ఖచ్చితంగా అందుతుంది. నువ్వులను తీసుకోవడం వల్ల మోకాళ్లల్లో ఉండే ఇన్ ప్లామేషన్ తగ్గడంతో పాటు ప్రారంభ దశలో ఉన్న నొప్పులు కూడా చాలా ఈజీగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. కీళ్ల మధ్య ఇంకా మోకాళ్ల మధ్య ఇన్ఫెక్షన్ కారణంగా కార్టిలైజ్ దెబ్బతింటుంది. దీంతో జిగురు ఉత్పత్తి చేసే పొరలు కూడా దెబ్బతింటాయి. జిగురు ఎక్కువగా ఉత్పత్తి కాకపోయినా, కార్టిలైజ్ దెబ్బతిన్నా కూడా నొప్పులు చాలా ఎక్కువవుతాయి.అందుకే కీళ్ల నొప్పులకు కారణమయ్యే ఈ ఇన్ ప్లామేషన్, ఇన్ఫెక్షన్ ను తగ్గించడంలో నువ్వులు చాలా బాగా పని చేస్తాయని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా తెలిసింది.


ఇంకా రోజుకు 10 నుండి 15 గ్రాముల నువ్వులను నెలరోజుల పాటు ఎలా తీసుకున్నా కూడా ఈజీగా నొప్పులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రియో పోరోసిస్, ఆస్ట్రియో ఆర్థరైటిస్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు ఇంకా మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడే వారు నువ్వులను తీసుకోవడం వల్ల చాలా మంచి మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా అలాగే నువ్వుల్లో సెసామిన్ అనే రసాయన సమ్మేళనం కూడా ఉంటుంది.ఇది కార్టిలైజ్ దెబ్బతినకుండా నిరోధించడంలో చాలా బాగా సహాయపడుతుంది. 100 గ్రాముల నువ్వుల్లో మొత్తం 1450 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఈ క్యాల్షియం ఎముకలు గుళ్లబారకుండా ఇంకా ఎముకలు గట్టిగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. ఈ విధంగా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఇంకా ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు నువ్వులను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: