రాత్రి నిద్రపట్టకపోతే వెంటనే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
ఇక కొంతమందికి అర్థరాత్రి దాకా నిద్ర అనేదే రాదు. దీనివల్ల చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి. నిద్ర లేకపోవడం వల్ల మనసుకు ఇంకా శరీరానికి విశ్రాంతి లభించక మరుసటి రోజు అలసట ఇంకా చాలా నీరసంగా కనిపిస్తారు. నేటి జీవనశైలిలో నిద్రకు సంబంధించిన సమస్యలు ప్రజల జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయి. దీని కారణంగా చాలా మంది ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. రాత్రిపూట ఆలస్యంగా పడుకునే సమస్య ఉన్నవారు కొన్ని టిప్స్ పాటించి ఈ సమస్యని దూరం చేసుకోవచ్చు. ఆయుర్వేద మందులు, సుగంధ ద్రవ్యాలు ఇంకా ఇంట్లో ఉపయోగించే కొన్ని పదార్థాలు తొందరగా నిద్రవచ్చేలా చేస్తాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.చామంతి టీని తాగడం వల్ల మనస్సు చాలా రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే ఇందులో అపిజెనిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నిద్రకు సంబంధించిన సమస్యలను చాలా ఈజీగా తగ్గిస్తుంది.


ఇంకా అలాగే రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం వల్ల మనసుకు చాలా విశ్రాంతి లభిస్తుంది. దీంతో మీకు మంచి నిద్ర కూడా వస్తుంది. విపరీతమైన అలసట వల్ల నిద్రపట్టని వారు గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ తేనెని కలిపి తాగాలి. ఇలా తేనెతో పాలను తాగడం వల్ల నిద్రలేమి సమస్యకు చాలా ఈజీగా పరిష్కారం లభిస్తుంది. ఇంకా అలాగే అశ్వగంధ కూడా మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మీరు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో అశ్వగంధ పొడిని కలిపి తాగితే ఒత్తిడి ఈజీగా తగ్గుతుంది. దీంతో మీరు చాలా త్వరగా మంచి నిద్రను పొందవచ్చు. మీకు రాత్రి నిద్ర సరిగ్గా రాకపోతే పడుకునే ముందు పాదాలకు ఆవాల నూనెతో బాగా మసాజ్ చేయాలి. అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి ఈజీగా తగ్గుతుంది.ఇంకా మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మంచి నిద్రకు దారి తీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: