కీళ్ళ నొప్పులని తగ్గించే సూపర్ టిప్?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కూడా కీళ్ల నొప్పులు, నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు. పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల శరీరం చాలా బలహీనంగా తయారవుతుంది. అయితే ఈ సమస్యని తగ్గించుకోడానికి ఇప్పుడు చెప్పబోయే టిప్ ఖచ్చితంగా పాటించండి.తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.ఒక గిన్నెలో పాలు, గసగసాలు ఇంకా ఫూల్ మఖనీ వేసి కలపాలి. తరువాత ఈ పాలను ముప్పావు గ్లాస్ అయ్యే దాకా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో రుచి కోసం పటిక బెల్లాన్ని కూడా మీరు కలుపుకోవచ్చు. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు పటిక బెల్లాన్ని ఉపయోగించకపోవడమే వారి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా తయారు చేసుకున్న పాలను తాగుతూ ఫూల్ మఖనీని ఇంకా గసగసాలను తినాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు తీసుకోవడం వల్ల మన శరీరానికి ఖచ్చితంగా తగినంత క్యాల్షియం లభిస్తుంది.అందువల్ల ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి.ఇంకా అలాగే అంతేకాకుండా రక్తహీనత సమస్య కూడా రాకుండా ఉంటుంది.


నీరసం ఇంకా నిస్సత్తువ వంటి సమస్యలు తగ్గి రోజంతా కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా పని చేసుకోగలుగుతారు. ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మలబద్దకం ఇంకా అలాగే శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే మీ గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ మిశ్రమం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా పాలను ఇంకా ఫూల్ మఖనాను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. అలాగే మీ చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనబడుతుంది. ఈవిధంగా మన ఇంట్లోనే ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలను మనం ఈజీగా దూరం చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం కూడా తలెత్తకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: