అధిక బరువుని తగ్గించే డ్రింక్స్ ఇవే?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో చాలామంది కూడా ఈ అధిక బరువుతో ఎంతగానో బాధపడుతున్నారు. మారిన జీవనశైలి ఇంకా అలాగే ఆహారపు అలవాట్లు అనేవి అధిక బరువుకు ప్రధాన కారణం అవుతున్నాయి. అయితే బరువు పెరగడం ఈజీ కానీ..తగ్గడం మాత్రం అసలు అంత తేలికైన పనికాదు.అయితే మీరు బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఇక్కడ మీకు సహాయపడే కొన్ని పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుదాం. ఈ పానీయాలు బరువును తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. అంతేకాదు ఇవి మీ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.ఇక ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకునే ఆ పానీయాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక చాలా త్వరగా బరువు తగ్గాలనుకునేవారికి వాటర్ డిటాక్స్ తీసుకోవడం ఖచ్చితంగా చాలా అవసరం. ఇక బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు పలు రకాల వాటర్ రెసిపిలను ప్రయత్నించవచ్చు. రోజు కేవలం నీటిని మాత్రమే తాగాలంటే ఖచ్చితంగా చాలా బోర్ గా ఫీల్ అవుతుంటాం. అందుకే నిమ్మ, పుదీనా,దోసకాయ ఇంకా అలాగే నారింజ ముక్కలను కలిపి సిట్రస్ నీటిని మీరు తయారు చేసుకోవచ్చు. శరీరం నిర్విషీకరణలో ఈ సిట్రస్ నీరు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.


అందుకే ప్రతిరోజూ కూడా ఉదయం పూట ఈ నీటిని తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఈజీగా బరువు తగ్గుతారు.ఇంకా బరువు తగ్గాలనుకునేవారికి పసుపు పాలు కూడా చాలా పర్ఫెక్టుగా పనిచేస్తాయి. పసుపులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకా అలాగే విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని వైద్యపరంగా వాడటమే కాకుండా…వంటల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేద వైద్యంలో దీనిని చర్మ రుగ్మతలు, అలెర్జీలు ఇంకా అలాగే కీళ్ల నొప్పులు వంటి వ్యాధులకు నివారిణిగా ఉపయోగిస్తున్నారు.ఈ పసుపు పాలు పడుకునేముందు తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ ఉదయం పూట తాగితే కూడా ఖచ్చితంగా చాలా రకాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. పసుపుపాలు వీటిని ప్రతిరోజూ తాగినట్లయితే ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు మీ రోగనిరోధకశక్తిని బాగా పెంపొందిస్తుంది.అలాగే శరీర కొవ్వు కూడా చాలా ఈజీగా కోల్పోతుందని వైద్యనిపుణు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: