లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే..?

Purushottham Vinay
మీ లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మీ డైట్ లో ఈ ఆహారాలను చేర్చుకోండి. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు చాలా పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ కొన్ని వాల్ నట్స్ కనుక మీరు మీ డైట్ లో చేర్చుకున్నట్లయితే ఊపిరితిత్తుల సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇవి ఆస్తమాతో బాధపడేవారికి ఎంతగానో మేలు చేస్తుంది.ఇంకా అలాగే చేపలు కూడా ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయనే సంగతి అందరికీ తెలుసు. ఊపిరితిత్తులకు అధిక మొత్తంలో కొవ్వు ఉంటే ఖచ్చితంగా చేప చాలా మేలు చేస్తుంది.ఎందుకంటే చేపల్లో ఉండే ఒమేగా -3కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యానికి చాలా రకాలుగా సహాయం చేస్తాయి.ఇంకా అలాగే బెర్రీస్ లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు ఎంతగానో సహాయపడుతాయి. ఆహారంలో బెర్రీలను చేర్చుకున్నట్లయితే మీ ఊపిరితిత్తులను ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుతాయి.ఇంకా అలాగే బ్రోకలిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.


ఊపిరితిత్తులను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడంలో బ్రొకోలి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.ఇవి ఊపిరిత్తులను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడంతోపాటు శరీర స్టామినాను పెంచడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.ఇంకా అలాగే అల్లంని కూడా ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి.ఎందుకంటే దీనిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను కాలుష్యం నుంచి ఈజీగా రక్షిస్తాయి. అల్లం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వాయుమార్గాలనేవి తెరచుకుని ఆక్సిజన్ ప్రసరణ అనేది సరిగ్గా జరుగుతుంది. అల్లం ఊపిరితిత్తులకు చాలా రకాలుగా మేలు చేస్తుందని ఇఫ్పటికే చాలా అధ్యయనాలు రుజువు చేశాయి.అలాగే ప్రతి రోజూ కూడా ఆపిల్ తింటే ఊపిరితిత్తులకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు లంగ్స్ ను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్, ఇ, సి , బీటా కెరోటిన్ ఇంకా సిట్రస్ పండ్లు ఊపిరితిత్తులకు చాలా మంచివని ఓ పరిశోధనలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: