అలసట రాకుండా ఏం చెయ్యాలి?

Purushottham Vinay
ఇక అలసట అనేది అందరికీ వస్తుంది. ముఖ్యంగా నిద్రలేమి ఇంకా ఐరన్ లోపం వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడేవారు ఎక్కువగా అలసటకు గురవుతారు. అలాగే అలసటకు గురైనప్పుడు శక్తి కోసం మంచి ఆహారం తీసుకుంటుంటాం. అయితే ఆ సమయంలో టీ, కాఫీ లేదా తీపి ఎక్కువున్న పదార్థాలు తింటే తక్కువ తిన్నా కూడా మనకు కడుపు నిండినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా అలసటకు గురైనప్పుడు టీ, కాఫీ వంటి డ్రింక్స్ అస్సలు తాగకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలసటకు గురవకుండా కొన్ని టిప్స్ పేర్కొంటున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మద్యపానం అనేది ఆరోగ్యానికి హనికరం అనే మాట మనకు తెలిసిందే. అలసట సమస్య నుంచి బయటపడడానికి మద్యపానానికి చాలా దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మద్యం నిద్రలేమి సమస్య, అలాగే తినే సమయాలను ఇంకా అలాగే గుండె స్పందన రేటును ప్రభావితం చేస్తున్నందు వలన ఖచ్చితంగా మద్యానికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇక అలసటకు గురవకుండా ఉండడానికి ఖచ్చితంగా కెఫిన్ ను తక్కువగా చేసుకోవాలి.


ముఖ్యంగా టీ, కాఫీ వంటి ఉత్పత్తులకు చాలా దూరంగా ఉండాలి. కాఫీ ఇన్స్టంట్ గా మేలు చేసినప్పుటికీ ధీర్ఘకాలికంగా ఆరోగ్యానికి కీడు చేసే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.ఇక సాధారణంగా చలికాలంలో నీటిని తక్కువగా తాగుతాం. ఇది ఖచ్చితంగా హైడ్రేషన్ సమస్యలకు కారణమవుతుంది. నిర్జలీకరణం కూడా ఒక వ్యక్తి మానసిక స్థితి, శక్తి స్థాయి ఇంకా అలాగే స్పష్టంగా ఆలోచించే సామర్థ్యాన్ని మార్చగలదని ఓ పరిశోధన కనుగొంది. కాబట్టి ఏకాగ్రత, అలసట ఇంకా అలాగే ఆందోళనపై నిర్జలీకరణ ప్రభావం మహిళలపై మరింత తీవ్రంగా ఉంటుందిఇక ప్రతిరోజూ కూడా ఆహారంలో ప్రోటీన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రోటీన్లు స్టామినా లెవెల్స్ ను పెంచడంలో చాలా బాగా సాయం చేస్తాయి. అలాగే కండరాల నష్టాన్ని కూడా ఈజీగా తగ్గిస్తాయి. అథ్లెట్లు ఇంకా అలాగే చురుకైన జీవన శైలి ఉన్నవారు సప్లిమెంట్ల ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందేలా చూసుకోవడం వారి ఆరోగ్యానికి మంచిది.కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. జాగ్రత్తగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: