ఈ క్రీం తింటే ఎనలేని ఆరోగ్యం మీ సొంతం?

Purushottham Vinay
చాలా మంది కూడా స్మూతీస్, కుక్కీస్, కేక్స్, డిసర్ట్స్, షేక్స్ వంటివి ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక ఈ వంటల తయారీలో క్రీమ్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. వివిధ రుచుల్లో క్రీమ్స్ అనేవి మనకు విరివిగా లభిస్తాయి.ఇక క్రీమ్స్ ను వాడడం వల్ల మనం చేసే వంటల రుచి కూడా మరింత పెరుగుతుంది. అయితే ఈ క్రీమ్స్ ను ఎక్కువగా వాడడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. దాంతో పాటు ట్రై గ్లిజరాయిడ్ల శాతం కూడా పెరుగుతుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు కూడా ఎక్కువగా వస్తాయి. ఇంకా అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. పాల నుండి తయారు చేసే బటర్, క్రీములకు బదులుగా కొకోనట్ క్రీమ్ ను వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ కొకోనట్ క్రీమ్ ను మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరిని తీసుకొని ముక్కలుగా చేసుకోవాలి. ఆ తరువాత ఈ ముక్కలను జార్ లో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని  పిండితే దాని నుండి కొబ్బరి పాలు వస్తాయి.ఈ పాలను తీసుకొని నాలుగు నుండి ఐదు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల కొబ్బరి పాలపై మందంగా ఇంకా అలాగే చిక్కగా తేటలాగా ఏర్పడుతుంది.


ఇక ఇదే కొబ్బరి క్రీమ్. ఈ కొబ్బరి పాలను ఫ్రిజ్ నుండి బయటకు తీసి నెమ్మదిగా వాటి నుండి క్రీమ్ ను సెపరేట్ చేయాలి. ఈ క్రీమ్ ను ఫ్రిజ్ లో ఉంచి స్టోర్ కూడా చేసుకోవచ్చు. పాల నుండి తయారు చేసిన క్రీమ్ కు బదులు ఈ కొకోనట్ క్రీమ్ ను మనం ఉపయోగించుకోవచ్చు.ఐస్ క్రీమ్స్, స్మూతీస్, షేక్స్ ఇంకా డిసర్ట్స్ తో పాటు వంటల్లో కూడా మనం ఈ కొకోనట్ క్రీమ్ ను ఉపయోగించుకోవచ్చు.ఇక బటర్ కు బదులుగా కూడా ఈ కొకోనట్ క్రీమ్ ను మనం వాడవచ్చు. ఇక ఈ క్రీమ్ లో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు.దీనిని వాడడం వల్ల మెదడుకు చాలా మేలు కలుగుతుంది.కొబ్బరి తెలివితేటలకు ఇంకా అలాగే మేధాశక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా అలాగే దీనిని వాడడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఈజీగా తగ్గుతాయి. బటర్ కు ఇంకా మిల్క్ క్రీమ్ కు ప్రత్యామ్నాయంగా ఈ కొకోనట్ క్రీమ్ ను వాడడం వల్ల రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: