పంటి నొప్పి చిటికెలో తగ్గాలంటే..?

Purushottham Vinay
పిప్పి పన్ను సమస్య ఇంకా అలాగే పంటి నొప్పిని తొలగించడానికి వెల్లుల్లి చాలా బాగా సహాయపడుతుంది. ఈ వెల్లుల్లి నూనెను పంటి నొప్పికి ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు 7 నుంచి 8 మొగ్గలు వెల్లుల్లిని తీసుకొని వాటిని బాగా మెత్తగా చేసి, పిప్పి పన్ను ఉన్న చోట లేదా నొప్పి ఉన్న చోట అప్లై చేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు పాటు అలాగే ఉంచి ఆ తర్వాత కడిగేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అలాగే లవంగ నూనె కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. లవంగ నూనె 2 నుంచి 3 చుక్కలను తీసుకొని వాటికి పత్తిని ఉపయోగించి వాడండి. మీరు రాత్రి పూట లవంగ నూనెను అప్లై చేయవచ్చు. ఇంకా అలాగే ఇది కాకుండా లవంగం నూనెలో కాటన్ వేసి పిప్పి పన్ను మీద అలాగే ఉంచండి. ఈ రెమెడీని క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ సమస్య చాలా త్వరగా నయమవుతుంది.పంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు దంతాలను శుభ్రం చేసుకోవాలి.ఇందుకు వేప పుళ్ళను  ఉపయోగించవచ్చు.


దంతాలు శుభ్రంగా ఉంచుకునేందుకు వేప చాలా బాగా సహాయపడుతుంది.మీరు ఈ వేప పుళ్లను బ్రష్‌ లాగా కూడా ఉపయోగించవచ్చు. ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వేప కొమ్మలతో తమ దంతాలను బాగా శుభ్రం చేసుకుంటారు. అందుకు ఈ వేపలోని ఔషధ గుణాలే కారణం.ఇక కొబ్బరి నూనెను కూడా మన పంటి కావిటీస్‌ను వదిలించుకోవడానికి ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు ఒక చెంచా స్వచ్ఛమైన కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనెను తీసుకోని ఈ నూనెను పుక్కిట పట్టండి. ఈ నూనెను సుమారు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే పుక్కిలించండి. అలా పుక్కిలించి ఆ తరువాత ఉమ్మేయండి.ఇంకా అలాగే లైకోరైస్ రూట్ సమస్యను తగ్గించడానికి చాలా అద్భుతమైన పరిష్కారం అని చెప్పవచ్చు. ఇందుకోసం మీరు లిక్కరిస్ ముక్క తీసుకొని దానిని పౌడర్ చేయండి. బ్రష్‌తో ఈ పొడిని పంటికి అప్లై చేసి దంతాలను శుభ్రం చేసి తరువాత నీటితో శుభ్రం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: