సర్జరీ చేసి.. ప్రపంచ రికార్డు కొట్టారు?

praveen
ఇటీవల కాలంలో ఎంతో మంది ప్రపంచ రికార్డు సాధించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పాలి.  ఈ క్రమంలోనే ప్రపంచ రికార్డు కోసం ఒకే విషయంపై
 ఏళ్ల తరబడి సాధన చేస్తూ ఇక అందులో రాటుదైన తర్వాత ప్రపంచ రికార్డు సాధించే పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు. అయితే ఇలా ప్రపంచ రికార్డు సాధించడం అంటే అంత తేలికైన విషయం కాదు. ప్రపంచంలో ఉన్న అందరికంటే మనలో ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నప్పుడు.. ఆ టాలెంట్ను మరింత ప్రత్యేకంగా నిరూపించుకున్నప్పుడు మాత్రమే ఇక ఇలాంటి రికార్డు సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాలి.

 అయితే ఇప్పుడు వరకు ఎంతో మంది చిత్ర విచిత్రమైన పనులు చేసే ప్రపంచ రికార్డు సాధించడం గురించి చాలానే చూస్తూ ఉన్నాం. కొంతమంది అయితే ఇక ఇలాంటి రికార్డుల కోసం ఏకంగా తమ ప్రాణాలను సైతం ప్రాణంగా పెడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా తరచూ ఇక ఏదో ఒక ప్రపంచ రికార్డుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఇక ఇప్పుడు ఏకంగా చిత్ర విచిత్రమైన పనులు చేయడం కాదు ఏకంగా సర్జరీ చేయడం ద్వారా డాక్టర్లు ప్రపంచ రికార్డులను నెలకొల్పారు అని చెప్పాలి.

 అత్యంత వేగంగా సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్లుగా ఇక వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఫోర్టీస్ట్ ఎస్కార్ట్ ఆసుపత్రి వైద్యులు ఒక 86 ఏళ్ల వృద్ధురాలికి  తొంటి భాగానికి కేవలం 15 నిమిషాల 30 సెకండ్లలో సర్జరీ నిర్వహించారు. అయితే ఇది ప్రపంచ రికార్డు అంటూ వైద్యులు తెలపడం గమనార్హం. రికార్డ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ సర్జరీ చేయలేదని తెలిపారు సదర్ వైద్యులు. పేషంట్  ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స పూర్తి చేయాలని లక్ష్యంతోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇలా 15 నిమిషాల 30 సెకన్లలో సర్జరీ పూర్తి చేసిన డాక్టర్ కౌశల్ మీశ్రా గతంలో 18 నిమిషాల్లో సర్జరీ చేసిన రికార్డు కూడా సృష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: