ఎండిన టమాటాలు ఆరోగ్యానికి ఎంత మంచివంటే?

Purushottham Vinay
మన ఆరోగ్య విషయంలో కూరగాయలు ఎప్పుడూ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.మనం తినే కూరగాయలు మన శరీరానికి కావలసిన పోషకాలను అందించి మనకు ఖచ్చితంగా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి.అలా మనం ఎప్పుడు తీసుకునే కూరగాయలలో టమోటా కూడా ఒకటి. దాదాపుగా అన్ని ప్రాంతాలవారు కూడా ఈ టమాటలను తింటుంటారు. ఇక వీటితో చేసిన వంటకాల రుచి కూడా చాలా బాగుంటుంది. టమోటాలతో శరీరానికి కావలసిన పోషకాలు చాలా పుష్కలంగా లభిస్తాయి. ఇంకా అలాగే  శరీరానికి కావలసిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్, సహజ చక్కెర, ఫైబర్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ ఎ, ఇ, సి, బి6 ఇంకా అలాగే రిబోఫ్లావిన్‌ వంటి పోషకాలు టమోటాల నుంచి చాలా పుష్కలంగా లభిస్తాయి. అయితే కేవలం తాజా టమాటాల ద్వారా కాక ఎండిపోయిన ఎమోటాల వల్ల కూడా మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఎందుకంటే ఈ ఎండిన టమాటాలలో కూడా చాలా రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో విటమిన్ సి, కె, నియాసిన్, కాపర్, ప్రొటీన్, మాంగనీస్, పొటాషియం ఇంకా అలాగే ఫైబర్ వంటి పోషకాలు చాలా పుష్కలంగా లభిస్తాయి. అలాగే మన డైట్‌లో డ్రై టమాటాలు చేర్చుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.


డ్రై టమోటాలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నుంచి శరీరానికి మంచి రక్షణ కల్పిస్తుంది. ఇంకా అలాగే వీటి కారణంగా న్యుమోనియా ఇంకా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు కూడా తగ్గుతుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు విటమిన్‌ సి తీసుకోవడం చాలా మంచిది. ఈ టొమాటాలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును బాగా మెరుగుపరుస్తుంది.ఇంకా అలాగే హైపర్‌టెన్షన్‌ కారణంగా గుండె సమస్యలు, గుండె పోటు, కిడ్నీ వ్యాధులు ఇంకా గుండె పోటు వంచి సమస్యలు వచ్చే ప్రమాదాలను డ్రై టమాటాలు తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే టమాటాలలో పొటాషియం అనేది చాలా సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం అధిక రక్తపోటను కూడా ఈజీగా తగ్గిస్తుంది. డ్రై టమోటాలు తీసుకోవడం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. కాల్షియం ఎముకల దృఢంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది. ఇది గుండె కండరాలను కూడా బాగా బలపరుస్తుంది. ఎండిన టమోటాలు మలబద్ధకం, అజీర్తి ఇంకా అలాగే గ్యాస్ట్రిక్‌ వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: