ఇలా చేస్తే సుఖమైన నిద్ర మీ సొంతం?

Purushottham Vinay
ఇక చక్కటి సుఖమైన నిద్రను సొంతం చేసుకోవాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిద్రించే ముందు మన చుట్టు పక్కల ఎలాంటి శబ్దం అనేది లేకుండా చేసుకోవాలి. ఇంకా అలాగే నిద్రించే స్థలం, దిండు ఇంకా మనం ధరించిన దుస్తులు కూడా మన నిద్రపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపుతాయి. అందుకే మన ఒంటికి అనువుగా ఉండే దుస్తులను ధరించడం, మనం వాడే దిండ్లు, పరుపులు మెత్తగా ఇంకా అలాగే శుభ్రంగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. అలాగే నిద్రించే ముందు మనం తీసుకునే ఆహారం వల్ల కూడా నిద్రలేమి సమస్య అనేది వస్తుంది.అందుకే మనం నిద్రించడానికి రెండు గంటల ముందే మనం ఆహారాన్ని తీసుకోవాలి. అది కూడా చాలా సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.అలాగే మనం నిద్రించే గదిలో ఎక్కువగా వెలుతురు అనేది లేకుండా చూసుకోవాలి. అలాగే నిద్రించే ముందు లేదా సాయంత్రం పూట  వ్యాయామాలు అస్సలు చేయకూడదు.టీవీ, కంప్యూటర్ ఇంకా సెల్ ఫోన్ వంటి వాటిని ఎక్కువగా చూడకూడదు. ఆందోళన, ఒత్తిడి తగ్గేలా ధ్యానం ఇంకా అలాగే యోగా వంటివి ఖచ్చితంగా చేయాలి.


ఈ టిప్స్ పాటిస్తూనే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ పువ్వు ఇంకా అలాగే చిటికెడు జాజికాయ పొడిని కలిపి తీసుకోవాలి. జాజికాయ అనేది నిద్ర సుఖంగా పట్టేలా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడే వారు  పాలను తాగడం వల్ల వారికి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.అలాగే మనం ప్రతిరోజూ కూడా 7 నుండి 8 గంటల పాటు తప్పకుండా నిద్ర పోవాలి. శరీరానికి సరిపడే నిద్రించకపోవడం వల్ల రోజంతా కూడా చాలా నీరసంగా ఉంటుంది. అలాగే మెదడు పనితీరు కూడా దెబ్బతింటుంది. మతిమరుపు ఇంకా అల్జీమర్స్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే మనం శరీరానికి తగినంత నిద్రించడం చాలా అవసరం. ఈ టిప్స్ పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం సుఖమైన చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: