అల్లాన్ని ఇలా వాడితే ఏ రోగం దరిచేరదు?

Purushottham Vinay
అల్లాన్ని ఉపయోగించడం వల్ల మనం చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు. అయితే దీన్ని వంటల్లో వాడడం కంటే  నేరుగా తీసుకోవడం వల్ల మనం చాలా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. అల్లం రసాన్ని తీసుకున్నా లేదా దానితో కషాయాన్ని చేసుకుని తాగినా కూడా ఆరోగ్యానికి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. అల్లం కషాయాన్ని తయారు చేయడం చాలా ఈజీ. ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి ఒక రెండు ఇంచుల అల్లం ముక్కను తీసుకుని వాటిని బాగా శుభ్రపరిచి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత వీటిని కచ్చా పచ్చాగా దంచుకుని వాటిని పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో 200 ml నీళ్లు పోసి బాగా వేడి చేయాలి. ఇక ఆ నీళ్లు వేడయ్యాక దంచుకున్న అల్లం ముక్కలను వేసి కొంచెం సేపు మరిగించాలి.ఆ నీళ్లు  మరిగిన తరువాత స్టవ్ ని ఆఫ్ చేసి వడకట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ కషాయం గోరు వెచ్చగయిన తరువాత నేరుగా తాగవచ్చు. లేదంటే ఇందులో తేనె, నిమ్మరసంని కూడా కలిపి తాగవచ్చు. ఈ కషాయాన్ని ప్రతి రోజూ కూడా ఉదయం పూట పరగడుపున తాగడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఈజీగా పొందవచ్చు.


ఈ కషాయాన్ని తాగడం వల్ల జలుబు, దగ్గు, తలతిరగడం ఇంకా అలాగే మైగ్రేన్ వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. అలాగే కీళ్ల నొప్పులు ఇంకా వాపులు వంటి సమస్యలతో బాధపడే వారు ఈ కషాయాన్ని తాగడం వల్ల వారికి చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇంకా బీపీని నియంత్రించడంలోఅలాగే అల్జీమర్స్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా అల్లం చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో అలాగే లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో ఇంకా స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో కూడా అల్లం ఎంతగానో సహాయపడుతుంది. అల్లం కషాయాన్ని తాగడం వల్ల జీర్ణశక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. అల్లం కషాయాన్ని తాగడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ విధంగా అల్లం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: