గొంతు నొప్పిని చిటికెలో తగ్గించే చిట్కా?

Purushottham Vinay
గొంతు నొప్పిని చిటికెలో తగ్గించే చిట్కా?

ఇప్పుడు చలికాలం వల్ల చల్లటి వాతావరణం  కారణంగా తరచుగా మనకు గొంతు నొప్పి వస్తుంటుంది. దీని కారణంగా జలుబు, దగ్గు ఇంకా అనేక రకాల గొంతు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. గొంతునొప్పి వచ్చినప్పుడు మాట్లాడటం ఇంకా తినడం చాలా ఇబ్బందిగా ఉంటుంది.అయితే ఈ సమస్య నుండి బయటపడటానికి మీకు చాలా రోజుల సమయం పట్టవచ్చు. దీని కారణంగా అనేక రకాల ఇబ్బందులు కూడా పడవచ్చు. అయితే ఇలాంటి సమయంలో మీరు భయపడాల్సిన పని లేదు. కొన్ని సింపుల్ ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయట పడవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


పసుపు అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉన్న మసాలా. ఇంకా ఉప్పులో కూడా యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియాపై బలమైన దాడిని చేస్తాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మూలకం వాపు ఇంకా అలాగే పుండ్లు ఏర్పడకుండా చేస్తుంది. 
ఈ గొంతు నొప్పి సమస్యని ఈజీగా తొలగించడానికి సహాయపడుతుంది. అందుకే పసుపు, ఉప్పు కలిపిన నీళ్లతో పుక్కిలించండి. మీకు ఖచ్చితంగా ఎంతో మేలు కలుగుతుంది.అలాగే త్రిఫల అనేది ఒక మంచి ఆయుర్వేద మూలిక. ఈ మూలిక శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. అందుకే త్రిఫల నీటితో పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి నుండి మీకు చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే టాన్సిలైటిస్‌ నొప్పి వచ్చినా కూడా అది మంచి మందులా పనిచేస్తుంది.అలాగే తులసి మొక్కను చాలా మంది భారతీయ ఇళ్లలో ఉంటుంది. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.  గోరువెచ్చని నీటిలో తులసి ఆకులను వేసి పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి చాలా త్వరగా ఉపశమనం పొందుతారు.నిజానికి ఈ మొక్కలో యాంటీ బాక్టీరియల్ ఇంకా యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: