మోకాళ్ళ నొప్పికి చిటికెలో చెక్ పెట్టాలంటే?

Purushottham Vinay
మోకాళ్ళ నొప్పికి శరీరంలో క్యాల్షియం లోపించడం ఇంకా అలాగే అధిక బరువు వంటి వాటిని  ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే ఈ సమస్య తలెత్తగానే చాలా మంది కూడా చాలా ఎక్కువగా పెయిన్ కిల్లర్ లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల నొప్పి తగ్గనప్పటికి ఫ్యూచర్ లో మనం చాలా రకాల దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే ఈ మోకాళ్ల నొప్పులను మనం సహజంగా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. మోకాళ్ల పై హాట్ మడ్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల నొప్పి ఇంకా వాపు చాలా ఈజీగా తగ్గుతుంది.కండరాలకు విశ్రాంతి కలిగించడానికి ఇంకా ఇన్ ప్లమేషన్ ను తగ్గించడానికి ఈ హాట్ మడ్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది.అయితే ఈ హాట్ మడ్ ప్యాక్ ను ఎలా వేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇందు కోసం ముందుగా పొలాల దగ్గర ఉండే నల్ల మట్టిని తీసుకోవాలి. తరవాత ఆ మట్టిని ఉండలు లేకుండా మెత్తగా దంచి జల్లించుకోవాలి. తరువాత ఈ మట్టిలో నీళ్లు పోసి వాటిని బాగా నానబెట్టాలి. ఇక నానిన ఈ నల్లమట్టిని ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద ఉంచాలి.


తరువాత దీనిని 45 నుండి 50 డిగ్రీల దాకా మన చర్మం తట్టుకోగలిగేంత బాగా వేడి చేయాలి. తరువాత మీరు ఒక గిన్నెలో ఆవ నూనెను తీసుకోవాలి. దానిలో ఒక ముద్ద కర్పూరాన్ని వేసి కరిగించాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను మోకాళ్లపై రాసి ఒక పది నిమిషాల పాటు అలాగే బాగా మసాజ్ చేయాలి.తరువాత ఇలా నూనె రాశాకా వేడి చేసిన మట్టిని తీసుకుని మోకాళ్ల చుట్టూ ఒక ప్యాక్ లాగా వేసుకోవాలి. తరువాత దీనిపై నుండి ఒక గుడ్డని ఉంచి కట్టుకట్టాలి. మట్టిలో ఉండే కొన్ని రకాల ఔషధ గుణాలు మంచి పెయిన్ కిల్లర్ గా ఉపయోగపడతాయి. ఈ మట్టిని చల్లారే దాకా అలాగే ఉంచి తరువాత తొలగించి బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ మడ్ ప్యాక్ మోకాళ్ల నొప్పుల నుండి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే దీనిని రోజుకు రెండు సార్లు వాడాలి. పెయిన్ కిల్లర్ లను వాడి అనారోగ్య సమస్యల బారిన పడడానికి బదులుగా ఈ టిప్ ని ఉపయోగించడం వల్ల మోకాళ్ల నొప్పుల నుండి ఈజీగా ఉపశమనాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: