ఈ పువ్వుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు?

Purushottham Vinay
కేవలం అరటి పండు మాత్రమే కాదు. దాని పువ్వు  కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. అరటి పువ్వు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు దాన్ని విడిచిపెట్టరు.ఈ అరటి పువ్వులో శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్లు, పొటాషియం, విటమిన్స్ ఎ,సి,ఇ ఇంకా కె వంటివి చాలా పుష్కలంగా ఉన్నాయి. అరటి పువ్వులో ఉండే అధిక పొటాషియం వల్ల రక్తపోటును ఈజీగా నియంత్రించుకోవచ్చు. అంతేగాక హిమోగ్లోబిన్ స్థాయిలను నియంత్రించటానికి ఇంకా అలాగే రక్తహీనత నివారణకు అరటి పువ్వు చాలా మంచిది.మన శరీరంలో వ్యాధికారక బాక్టీరియా పెరగకుండా అరటి పువ్వు మంచి మందు వలే పనిచేస్తుంది. దీనిలోని అనామ్లజనిత లక్షణాలు క్యాన్సర్ ఇంకా గుండె జబ్బులతో పోరాడటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకం తగ్గిపోతుంది. మధుమేహం సమస్య ఉన్నవారికి కూడా ఇది చాలా గొప్ప ఆహారం. ఈ అరటి పువ్వులో ఉండే ప్లేవానాయిడ్స్ చాలా అద్భుతమైన ఇన్సులిన్ వాహకాలుగా పనిచేస్తాయి.ఈ పువ్వుతో చేసిన వంటకాలు తినటం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య ఈజీగా దూరం అవుతుంది. వంద మిల్లీగ్రాముల అరటి పువ్వు రసాన్ని పొద్దున్నే మూడుసార్లు తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి ఈజీగా తగ్గిస్తుంది. ఇంకా అలాగే రక్తాన్ని కూడా బాగా శుభ్రం చేస్తుంది.


ఊబకాయం సమస్యతో బాధపడేవారు అరటి పువ్వుతో చేసిన సూప్ తీసుకుంటే వారి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ఇందులో అల్లం ఇంకా కొత్తిమీర ఆకులు చక్కగా కట్‌చేసి వేసుకోవాలి.తరువాత రుచికి సరిపడా ఉప్పును కలుపుకుంటే చాలా మంచిది. దీన్ని వారానికి ఐదుసార్లు తీసుకుంటే ఖచ్చితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.అలాగే కడుపు పూత నివారణకు కూడా అరటిపువ్వు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మూత్ర విసర్జన చేసేటపుడు బాధాకరంగా ఉంటే అరటి పువ్వను తీసుకుంటే ఖచ్చితంగా వారికి ఉపశమనం కలుగుతుంది.ఇంకా అలాగే దీన్ని తీసుకుంటే శ్వాసలో తాజాదనం, చెమటలో దుర్వాసన రాకుండా ఉంటుంది. అలాగే కడుపు ఉబ్బరంగా ఉండి విపరీతంగా వాంతులు అయ్యేవారికి అరటి పువ్వను తీసుకుంటే మంచిది. అరటి పువ్వుతో చేసిన వంటకాన్ని రోజూ తీసుకుంటే స్త్రీలకు శక్తి ఇంకా గర్భాశయ సమస్యలు తలెత్తవు. అరటి పువ్వు రసాన్ని తేనెతో పొద్దున పూట పరగడపున తీసుకుంటే రుతుస్రావ సమస్యలన్నీ కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: