వారు బంగాళదుంప తినడం ప్రమాదమేనా..?

Divya
ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా షుగర్ వ్యాధి రావడం జరుగుతోంది. అయితే ఇలాంటి వారు బంగాళదుంపను తినొచ్చా లేదా అనే విషయం పైన సందేహపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి వాటిపైన కొంతమంది వైద్యులు పరిశోధనలు చేసి తెలియజేయడం జరుగుతోంది .వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బంగాళదుంపలు తినడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇవి అనేక సాంప్రదాయ భారతీయ వంటకాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇందులో పొటాషియం ,విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. చర్మం కాంతివంతంగా మెరవలంటే  కచ్చితంగా వీటిని తినడం మంచిది. అయితే షుగర్ ఉన్నవారు గురించి చెప్పాలి అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో  ఇవి ఎక్కువగా పెరిగేలా చేస్తాయట. అంతేకాకుండా బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచడానికి కారణమవుతాయని వైద్యులు తెలియజేయడం జరుగుతోంది.

కొన్ని రకాల బంగాళదుంపలలో తక్కువ గైసేమిక్ ఇండక్షన్ ని కలిగి ఉంటాయి. వీటిని తినవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే వండే పద్ధతి కూడా వీటి పైన ప్రభావం చూపిస్తుందని తెలియజేస్తున్నారు. ఉడికించి వేయించిన బంగాళదుంపలలో తక్కువ కార్బోహైడ్రేట్లు లోడ్ కలిగి ఉంటుందట.అదేవిధంగా ఆకుకూరలు బెండకాయలు వంటి వాటిలో అధికంగా ఫైబర్ కలదని తెలుపుతున్నారు.

వండుకొని తినడం వల్ల బంగాళదుంప లోని పిండి పదార్థం నిర్మాణం మారుతుంది. ఇది గైసేమిక్ ఇండెక్స్ గైసమిక్ లోడ్ రెండిటిని ప్రభావితం చేస్తుంది. బంగాళదుంపలను ఎక్కువగా ఉడికించిన తర్వాత వాటిని చల్లారిన తర్వాత తినడమే చాలా మంచిది. ఇందులో ఎక్కువగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. బంగాళదుంపను నూనెలో ఫ్రై చేసుకుని తినడం వల్ల క్యాలరీలు పెరుగుతాయి .వీటికి విరుద్ధంగా వెనిగర్ ఫైబర్ కూరగాయలు నిమ్మకాయ వేసి ఉడికించడం వల్ల ఈ క్యాలరీలు తగ్గుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే వీటిని అధికంగా తినడం వల్ల కొవ్వును పెంచుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: