అలాంటి వ్యాధులతో బాధపడేవారు వేరుశనగ తినకూడదని తెలుసా..!

Divya
వేరుశెనగ తినడానికి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడుతారు. ముఖ్యంగా చలికాలంలో నేను వేడిగా తినాలనిపించినప్పుడు వేరుశనగను వేయించుకొని ఎక్కువగా తీసుకుంటుంటారు.వీటిలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది పేదవాడి బాదాం అని కూడా చెప్పవచ్చు.బాదాంలో ఉన్న ప్రతి పోషకము వేరుశనగలో ఉంటుంది.వేరుశెనగ తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అంతే కాక సీజన్లో వచ్చే రోగాలతో పోరాడటానికి కావలసిన రోగనిరోధక శక్తి పెంచుతుంది. వేరుశెనగ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.కానీ వీటికి కొన్ని ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేసే గుణం ఉంటుంది. కావునా అలాంటివారు వేరుశనగ తినకపోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఆ వ్యాధులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

సోడియం పెరుగును..
ప్రస్తుతం మార్కెట్‌లో లభించే వేరుశెనగ రుచిని, రంగును అధికం చేయడానికి,ఉప్పు మరియు అనేక రకాల రసాయనాలు కలుపుతుంటారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో సోడియం పెరగడం వల్ల  బీపీ, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో అధిక బీపీ తో బాధపడేవారు వేరుశెనగకు దూరంగా ఉండటం చాలా మంచిది.
బరువును పెంచుతుంది..
కొందరికి వేరుశెనగ అంటే ప్రాణంగా ఉంటుంది.కావున అలాంటి వారు వేరుశ్శనక్కాయలను రోజూ తింటారు. ఇందులో అధిక కేలరీలు ఉండటం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. ఎవరైనా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే వేరుశెనగ తినడం మానీవేయడం చాలా మంచిది
.
అసిడిటీలో హానికరం
ఎసిడిటీ, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు వేరుశెనగకు దూరంగా ఉండాలి . వేరుశెనగ తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు అధికం అవుతాయి.. అందువల్ల ఇ వ్యాధులతో ఇబ్బంది పడేవారు పొరపాటున కూడా వేరుశెనగ తీసుకోకూడదు.లేదంటే సమస్యలు కొత్త సమయాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.అతిగా తినడం అంతా మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: