మోకాళ్ల నొప్పులను తగ్గించే సింపుల్ టిప్స్?

Purushottham Vinay
చాలా మందిని కూడా మోకాళ్ల నొప్పులు బాగా వేధిస్తుంటాయి.మారిన జీవన విధానం, పోషకాహార లోపం, అధిక బరువు, వయసు మీద పడడం వంటి అనేక కారణాల చేత మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఈ సమస్య నుండి బయట పడడానిక పెయిన్ కిల్లర్ లను, ఆయింట్ మెంట్ లను, నొప్పిని తగ్గించే స్ప్రే లను వాడుతుంటారు. పెయిన్ కిల్లర్ లను వాడడం వల్ల ఉపశమనం కలిగినప్పటికి వీటిని ఎక్కువ కాలం పాటు వాడడం వల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ నొప్పులను తగ్గించడంలో నిమ్మకాయ ఇంకా నువ్వుల నూనె ఎంతగానో ఉపయోగపడతాయి. నిమ్మకాయలు మన వంటింట్లో ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడంలో, శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపించడంలో నిమ్మకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే పోషకాలు నొప్పులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇంకా అదే విధంగా నువ్వులను కూడా మనం ఆహారంగా తీసుకుంటే చాలా మంచిది.


ఎందుకంటే ఈ నువ్వులల్లో క్యాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది.వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా ఇంకా అలాగే ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా అంతేకాకుండా నువ్వులు యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. శరీరంలో నొప్పులను తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి.  మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ముందుగా ఒక నిమ్మకాయను తీసుకుని దానిని రెండు ముక్కలుగా చేయాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కను తీసుకుని గోరు వెచ్చని నువ్వుల నూనెలో ముంచి మోకాళ్లపై బాగా రుద్దాలి. నిమ్మకాయ రసం ఇంకా అలాగే నువ్వుల నూనె చర్మంలోకి ఇంకేలా ఒక 5 నిమిషాల పాటు బాగా మర్దనా చేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల ఖచ్చితంగా మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ టిప్ ని పాటించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: