సైనస్ సమస్యతో బాధపడేవారికి సింపుల్ టిప్స్?

Purushottham Vinay
సైనస్ సమస్యతో బాధపడేవారి ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఏకధాటిగా ముక్కు కారుతుండటం, తుమ్ములు, చికాకు ఇంకా అలాగే తెలియని సమస్య సతమతం చేస్తాయి. అలర్జీ, జలుబు ఇంకా మనం పీల్చిన గాలిలో దుమ్ము ఎక్కువగా ఉండటం ఇంకా అలాగే ఇన్ఫెక్షన్స్ కారణంగా ముక్కులో ఉండే సైనసెస్ మూసుకుపోతుంది.ముక్కులో రంధ్రాలు ఇంకా అలాగే దుమ్మూ ధూళి చేరుకోవడం వల్ల సైనసెస్ అనేది మూసుకుపోతుంది. అప్పుడు గాలి పీల్చలేక ఇంకా వదలలేక చాలా రకాలుగా సతమతమవుతుంటారు.దీంతో శ్వాస తీసుకోవడం వారికి చాలా ఇబ్బందిగా మారుతుంది. తలనొప్పి, గురక ఇంకా అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తుతాయి. లక్షణాలు తీవ్రంగా ఉంటే కొన్ని సార్లు జ్వరం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సైనస్ తో బాధపడే వారు ఎక్కువగా డాక్టర్లను సంప్రదించి, ఇంగ్లీష్ మందులను వాడుతుంటారు. అలా కాకుండా కొన్ని ఈజీ టిప్స్ పాటించడం వల్ల ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ టిప్స్ పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బందులే కాకుండా మంచి ప్రయోజనాలు ఇంకా ఉపశమనం లభిస్తాయి.


ఇక అలాంటి పరిస్థితుల్లో ఆవిరి పడితే మంచి ఉపశమనం ఉంటుంది. నాసికా రంధ్రాలను తెరవడంలో స్టీమ్ థెరపీ అనేది బాగా సహాయపడుతుంది. వేడి వేడి నీటి మీద మీ ముఖాన్ని ఉంచి, ఆవిరి బయటకి పోకుండా క్లాత్ కప్పుకుని ఆవిరి పడితే చాలా మంచి అనుభూతి కలగడమే కాకుండా ముక్కు రంధ్రాలూ కూడా ఈజీగా తెరుచుకుంటాయి. వంటింటి పోపుల డబ్బాలో కచ్చితంగా ఉండే పసుపుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే సంగతి మనందరికీ కూడా తెలిసిందే. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి.ఇక ఈ సైనస్ కి చికిత్స చెయ్యడంలో పసుపు అనేది చాలా అద్భుత పాత్ర పోషిస్తుంది. వేడి వేడి టీ లో పసుపు కలుకుని తాగడం ఇంకా అలాగే అల్లం టీ లో కూడా కొద్దిగా పసుపు వేసుకుని తాగడం వల్ల ముక్కులో పేరుకుపోయిన శ్లేష్మాన్ని పోగొట్టడంలో చాలా బాగా సహాయపడుతుంది. ముక్కులో పేరుకున్న అడ్డంకులను తొలగించడానికి కారం కూడా చాలా మంచి ఫలితాన్నిస్తుంది. అయితే అధిక మొత్తంలో కాకుండా తక్కువగా అందులో కూడా ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: