కాఫీ ఎలా తాగితే ఆరోగ్యానికి మంచిది?

Purushottham Vinay
అందరూ కూడా ఎంతో ఇష్టంగా తాగే కాఫీతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో పొద్దున్నే వేడి వేడిగా పొగలు కక్కే కాఫీని సిప్ చేస్తుంటే ఆ అనుభూతే వేరు. అయితే చాలా మందిలో కాఫీ తాగడంపై ఎన్నో రకాల ఉన్నాయి. ఇందులో ఉండే కెఫిన్ ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని చాలా మంది కూడా భావిస్తుంటారు. ఇది కాస్త నిజమే అయినప్పటికీ.. కాఫీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే వున్నాయి. కాఫీ తాగడం వల్ల జీవక్రియ బాగా మెరుగుపడుతుంది. ఆకలిని కూడా అదుపులో ఉంచుంతుంది. బరువును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. కాఫీలో ఉండే కెఫీన్ కారణంగా నిద్రలేమి సమస్యలు కూడా కలగవచ్చు. ఇది శరీరం బరువు పేరిగేలా కూడా చేస్తాయి. కెఫిన్ సరిగ్గా పనిచేయడమే కాకుండా అడెనోసిన్ హార్మోన్‌ను అడ్డుకుంటుంది. దీని వల్ల నిద్ర సరిగ్గా పట్టక చికాకు అనేది కలుగుతుంది. అయితే కాఫీ తాగే సమయంలో చాలా మంది కూడా అడిషనల్ షుగర్ యాడ్ చేసుకుంటారు. ఇది శరీరంలో షుగర్ లెవెల్స్ ను కూడా బాగా పెంచుతుంది.


సాధారణంగా చాలా మంది కూడా కాఫీ తాగేటప్పుడు బిస్కెట్లు ఇంకా పేస్ట్రీలు తింటారు. ఇలా చేయడం వల్ల శరీరంలోకి అదనపు చక్కెర అనేది యాడ్ అవుతుంది. కేక్స్, పేస్ట్రీల స్థానంలో నట్స్ ఇంకా గుడ్లు వంటి ప్రొటీన్ డైట్ తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. సాయంత్రం సమయంలో కాఫీ తాగడం చాలా మందికి కూడా అలవాటు. ఇక అలాంటి పరిస్థితిలో కనీసం 100 ml కాఫీని తీసుకోవచ్చు. లేదంటే వారి నిద్రపై చెడు ప్రభావం చూపుతుంది. బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. పాలతో చేసిన కాఫీలో చాలా రకాల కేలరీలు ఉంటాయి. ఇది బరువు పెరగడానికి కూడా కారణం కావచ్చు.ఇంకా బరువు తగ్గడానికి కాఫీలో చక్కెర అస్సలు కలపవద్దు. కాఫీలో పాలను ఉపయోగించాలనుకుంటే వాటి బదులుగా బాదం లేదా కొబ్బరి పాలను ఉపయోగించాలి.దాల్చిన చెక్క పొడిని కలిపితే ఇంకా ఎన్నో మంచి ఉపయోగాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: