పురుషులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే?

Purushottham Vinay
పురుషులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. లేదంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యల బారినపడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ఆహారంపై శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. ముందు ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి. ఫెర్టిలిటీ సమస్యలు నీరసం మొదలైన సమస్యలు రాకుండా ఉండాలంటే ఇవి బాగా ఉపయోగపడతాయి.పండ్లని మగవారు ఖచ్చితంగా తమ డైట్‌లో చేర్చుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. ఇంకా అలానే నీరసం తగ్గుతుంది. అలాగే కివి ఫ్రూట్‌కూడా మంచిది. విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలానే ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి కూడా పురుషులకి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి దానిని కూడా డైట్ లో తీసుకోండి. అరటి పండ్లు మనకు ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి. సెక్సువల్ పవర్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. అలానే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.


ఇంకా అలాగే రోజూ వారీ ఆహారంలో మంచి కొలెస్ట్రాల్ ఉండేలా చూసుకోవాలి. అలాంటి ఫుడ్స్‌ని చేర్చుకోవాలి. ఫ్లాక్స్, ఫ్యాటీ ఫిష్, చియా సీడ్స్, సోయా ప్రొడక్స్ట్, వెజిటేబుల్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వంటి ఫుడ్స్ ద్వారా శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్ అందుతుంది. గుడ్ కొలెస్ట్రాల్‌నే హైడెన్సిటీ లిపో ప్రోటీన్ అని పిలుస్తారు. గుడ్ కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బుల బారినపడే రిస్క్ తగ్గుతుంది.మగవారు తరచూ ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. తద్వారా మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు. బీన్స్, బెర్రీలు,అవకాడో, పాప్ కార్న్, డ్రై ఫ్రూట్స్, యాపిల్స్, బ్రకోలీ, పొటాటో,నట్స్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. తృణధాన్యాల్లో ఫైబర్‌తో పాటు వివిధ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఓట్స్, రెడ్ రైస్ రూపంలో తృణ ధాన్యాలను తీసుకోవచ్చు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. ప్రోటీన్ డైట్‌లో పాలు, గుడ్లు, చికెన్ చేర్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: