ఇలా చేస్తే అధిక కొలెస్ట్రాల్ దూరం అవ్వాల్సిందే..!

Divya
ప్రతి ఒక్కరి ఆరోగ్యం వారు తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. లేదంటే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే రక్తం సరఫరా దెబ్బతిని అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.అవేంటో ఇప్పుడు చూద్దాం..!
కొలెస్ట్రాల్ వున్న ఆహారం ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులకు దారి తీస్తుంది.కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.అయితే కొవ్వు లలో కూడా మంచి కొవ్వులు ఉంటాయి.అవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కరిగే ఫైబర్, ప్రోటీన్స్  ను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అంతే కాకుండా ఆరోగ్య నిపుణులు అనేక ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినాలని,వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని చెబుతుంటారు.
చేపలు తినాలి.
మీరు నాన్-వెజ్ ఫుడ్ తినాలనుకుంటే.. మీ ఆహారంలో చేపలను చేర్చుకోవచ్చు. వాటిలో కొవ్వు తక్కువగా ఉండి,ప్రోటీన్లు మరియు ఒమేగా -3 ప్యాటి యాసిడ్స్ సీఫుడ్స్ లో పుష్కలంగా దొరుకుతాయి.ఇది చెడు కొలెస్ట్రాల్ కరిగించి, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా సంరక్షిస్తుంది.
పప్పు తినాలి.
పప్పులో ప్రొటీన్ పుష్కలంగా దొరుకుతుంది. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. కండర ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది.అలాగే మంచి బ్యాక్టీరియా పెంచుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. పప్పులు తినడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలను కూడా అదుపులో ఉంటుంది.
డ్రై ఫ్రూట్స్:
బాదం, పిస్తా, వాల్‌నట్‌లు, అవిసె గింజలు, నువ్వులు, ఎండు గింజలు తీసుకోవడం వల్ల ఇందులో ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ పుష్కళంగా లభించి,గుండె జబ్బులను రాకుండా కాపాడుతాయి.కాబట్టి ఏ ఆహారం అయినా అతిగా తినకుండా సమతలంగా తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి కొలెస్ట్రాల్ కూడా మీ శరీరంలో పేరుకుపోదు. పైగా అనారోగ్య సమస్యలు దరి చేరవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: