పాలను ఇలా చేసుకోని తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అనేది చాలా విపరీతంగా పెరిగిపోవడం వల్ల అనేక రకాల సమస్యల బారిన పడుతున్నారు. అందులో కామన్ గా వుండే ముఖ్యమైన సమస్య ఏంటంటే చాలా అధికంగా లావు అవ్వడం.ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, శరీరానికి శ్రమ లేకపోవడం, గంటల తరబడి ఒకే చోట కూర్చుని ఉండడం, హార్మోన్ చేంజెస్, నిద్రను నిర్లక్ష్యం చేయడం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల శరీర బరువు అదుపు తప్పుతుంటుంది.దాంతో రోజు అద్దం ముందు నిలబడి లావుగా ఉన్నామే అంటూ లోలోన తెగ మధన పడిపోతుంటారు. పైగా ఇరుగు పొరుగు వారు తమ శరీర ఆకృతిని ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంటే మరింత బాధ కలుగుతుంది. ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు ఈ జాబితా లో ఉన్నారా? అయితే ఇకపై చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పాలను రోజుకు ఒకసారి తీసుకుంటే ఎంత లావుగా ఉన్న వారైనా సన్నగా మారతారు. మరి ఆలస్యమెందుకు బరువు తగ్గించే ఆ పాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్న ఒక గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్‌ను పోయాలి. పాలు కాస్త హీట్ అవ్వగానే అందులో హాఫ్ టేబుల్ స్పూన్‌ అల్లం తురుము, హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి పసుపు కొమ్ము తురుము, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు లవంగాల పొడి, చిటికెడు జాజికాయ పొడి, పావు స్పూన్ వాము, పావు స్పూన్ ములేటి పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఖర్జూరం పేస్ట్ వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించుకోవాలి.ఇలా మరిగించుకుంటే గోల్డెన్ స్పైస్డ్ మిల్క్ తయారవుతుంది. ఈ మిల్క్‌ను స్ట్రైనర్ సాయంతో ఫిల్టర్ చేసుకుని.. ఉదయం లేదా రాత్రి నిద్రించడానికి గంట ముందు సేవించాలి. ఈ గోల్డెన్ స్ప్రైస్డ్ మిల్క్‌ను ప్రతి రోజు గనుక తీసుకుంటే ఎంత లావుగా ఉన్నవారైనా సన్నగా, నాజూగ్గా తయారవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: