బీపీ పెరగడానికి కారణాలు ఇవే..!!

Divya
ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది ఉప్పు తగ్గించి తిన్న.. కొందరైతే అసలు ఉప్పు తినకుండా ఉంటారు.. అలా బీపీ ఎక్కడ పెరిగి పోతుందో అన్న భయంతో తినకుండా ఉంటారు. అయినా కూడా బీపీ కంట్రోల్ అవ్వదు సహజంగా బీపీ పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రతి చిన్న విషయం అతిగా రియాక్ట్ కావడం వల్ల, సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల, ఎక్కువ ప్రెజర్ కి గురైన మానసిక ఒత్తిడి వల్ల ఇలా ఎన్నో రకాలు కారణాల వల్ల బిపి పెరగడం జరుగుతుందని కొంతమంది వైద్యులు సూచిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసులోనే ప్రతి ఒక్కరికి బీపీ రావడం జరుగుతోంది అందుచేతనే ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరు బీపీ ఒకసారి చెక్ చేయించుకోవడం చాలా మంచిది.130/90 కంటే రక్తపోటు అధికంగా ఉన్నట్లు అయితే వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ బీపీ ఉన్నట్లు అయితే మన జీవన శైలిలో పలు మార్పులను కచ్చితంగా చేసుకోవాలి.
1). ముఖ్యంగా ఉదయం పూట లేవగానే నడవడం వ్యాయామం చేయడం వంటివి చేయాలి ఇలా చేయడం వల్ల మానసిక ఆందోళన పడకుండా ఉంటారు.
2). ఉదయం లేవగానే ఒక పది నిమిషాల పాటు ధ్యానం  చేసి మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇక అంతే కాకుండా ఆహారంలో పలు మార్పులు చేసుకుంటూ ఎప్పటికప్పుడు బీపీని చెక్ చేసుకుంటూ రక్తనాళాలు కొవ్వు స్థాయిని పెరగకుండా చూసుకోవాలి.

బీపీ ఉన్నవారు ఉప్పును తగ్గించడం మంచిది చక్కర వినియోగాన్ని కూడా తగ్గించాలి అలాగే మద్యం సిగరెట్టు అలవాటు ఉన్నవారు వాటిని ఎంత తగ్గిస్తే అంత మేలు.

1).పండ్లు పచ్చికాయ కూరలు గింజ ధాన్యాలను తింటూ ఉండాలి.
2). తేనే గోరువెచ్చని నీటిని ప్రతిరోజు తాగడం చాలా మంచిది

3). సూర్య రష్మీ, బయట గాలికి ఎక్కువగా  ఉండే విధంగా చూసుకోవాలి.
4). ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: